...

Bride death: పెళ్లి పీటలపైనే నవ వధువు మృతి.. ఏమైందో తెలుసా?

Bride death: పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆమెతో పాటే తల్లిదండ్రులు కూడా.. కూతురు పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే తమ బాధ్యత తీరుతుందనుకున్నారు. అందుకే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించారు. ఎంతో ఆనందంతో అమ్మాయి కూడా అత్తారింటికి వెళ్లాలని… పిల్లా పాపలతో సంతోషంగా గడపాలని కలలు కన్నది. కానీ ఆ ఆశ పెళ్లి తంతు పూర్తయ్యే వరకు కూడా లేదు. ఎందుకంటే పెళ్లి పీటల పైనే ఆ నవ వధువు మృతి చెందింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ వివాహం సృజన అనే అమ్మాయితో నిశ్చయించారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు. సరిగ్గా ముహూర్తం సమయానికి… సిగ్గు పడుతూ పెళ్లి పీటలపై కూర్చున్న అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏమైందో తెలుసుకునేలోపే అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన అమ్మాయిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సృజన చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.