Actor raja comments: ఒకప్పుడు వెన్నెల, ఆనంద్ సినిమాలతో మెప్పించిన రాజా… ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అయినా అవేవీ పెద్దగా విజయం సాధించలేదు. హీరోగా సక్సెస్ సాధించకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలు చేశారు. తర్వాత సినీ రంగానికి దూరమై పాస్టర్ గా మారాడు. క్రిస్టియన్ మత ప్రచారం చేస్తూ… చర్చిలు, క్రిస్టియన్ ఈవెంట్లలో ప్రార్థనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తనకి జీవితాన్నిచ్చిన సినిమాలపైనే ఆయన విమర్శలు చేశారు. దీంతో నెటిజెన్లు ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
“శుక్రవారం వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఎగబడతారు ఎందుకు. ఆ పనికి మాలిని సినిమాలు చూడటం వల్ల మీకేమొస్తుంది. గంట సేపు లైన్లో నిలబడి మరీ టికెట్లు కొంటారు. కానీ దీనికి బదులుగా ఓ నాలుగు గంటలు మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల కోసం ప్రార్థించండి.” అంటూ ఆయన మాట్లాడిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో నెటిజెన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు సినిమాలు చేసి బతికిన నువ్వు ఇలా మాట్లాడటం సరికాదంటూ క్లాస్ పీకుతున్నారు.
View this post on Instagram