Sarkaru vari para song :సూపర్ స్టార్ మహోష్ బాబు ఇటీవలే నటించి సర్కారు వారి పాట సినిమా టైటిల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం వేచి చూస్తున్న మహేశ్ బాబు అభిమానులు ఈ పాట వింటూ పండగ చేసుకుంటున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మిల్క్ బాయ్.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో మహేశ్ బాబు స్వీయ నిర్మాణంలో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అయితే మే 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇది వరకే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమా అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. కళావతి పాట అయితే సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎవరి నోట విన్నా, రీల్స్ చూసినా ఈ పాటే మారు మోగుతుంది. అయితో మరో పాట పెన్నీలో మహేశ్ ముద్దుల కూతురు సితార సందడి చేసి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.