Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Sarkaru Vaari Paata Penny Song Promo : సర్కారు వారి పాట మూవీలో పెన్నీ పాటకు సితార అదిరే డాన్స్… వీడియో వైరల్!

Sarkaru Vaari Paata Penny Song Promo : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా.. సర్కారు వారి పాట.. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే కళావతి సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు మరో స్పెషల్ అప్ డేట్ రిలీజ్ అయింది. ఈ స్పెషల్ సాంగ్ వీడియోకు సంబంధించి ప్రోమోను మహేశ్ బాబు షేర్ చేశాడు. మహేశ్ తన కూతురు సితార ఘట్టమనేనితో కలిసి నటించిన మొదటి సినిమా కూడా ... Read more

By Vinod Kumar

Published on: March 19, 2022 10:31 PM

Updated on: March 19, 2022 10:43 PM

Sarkaru Vaari Paata Penny Song Promo

---Advertisement---

Sarkaru Vaari Paata Penny Song Promo : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా.. సర్కారు వారి పాట.. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే కళావతి సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు మరో స్పెషల్ అప్ డేట్ రిలీజ్ అయింది. ఈ స్పెషల్ సాంగ్ వీడియోకు సంబంధించి ప్రోమోను మహేశ్ బాబు షేర్ చేశాడు. మహేశ్ తన కూతురు సితార ఘట్టమనేనితో కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే..

ఈ మూవీలో మొదటిసారి సితార సిల్వర్ స్ర్కిన్ పై సందడి చేయనున్నారు. ప్రతి రూపాయాని అందరూ గౌరవించాలంటూ సాగే పెన్నీ పాటకు సితార అద్భుతంగా డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మహేశ్ బాబు తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. సితార మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో అలరించబోతుందంటూ మహేశ్ ట్వీట్ చేశాడు.

ఆదివారం రోజున సర్కారు వారి పాట మూవీ నుంచి పెన్నీ ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. సితార ఇప్పటికే హాలీవుడ్ యానిమేషన్ మూవీ ఫ్రోజెన్ 2కు తెలుగు వెర్షన్ బేబీ ఎల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. సర్కారు వారి పాట మూవీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో రానుంది. మైత్రిమేకర్స్ 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. సర్కారువారి పాట మూవీలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ సంగీతాన్ని అందించారు. మే 12న సర్కారు వారి పాట మూవీ రిలీజ్ కానుంది.

Read Also : RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రమోషన్స్ పీక్స్.. ఫస్ట్‌డే కలెక్షన్లే జక్కన్న టార్గెట్..!

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!