Samanatha Naga Chaitanya : సామ్, చై మళ్లీ కలవబోతున్నారు.. రీల్ లైఫ్ కోసమా.. రియల్ లైఫ్ కోసమా!

Samanatha Naga Chaitanya :
Samanatha Naga Chaitanya :

Samanatha Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకొని చాలా రోజులు గడుస్తున్నా.. వారి అభిమానులు మాత్రం ఈ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వారకు వారు మళ్లీ కలుస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీటిపై ఇటు సామ్ కానీ, అటు చై కానీ ఏనాడు స్పందించలేదు.

కానీ తాజాగా మాత్రం వారిద్దరూ మళ్లీ కలబోతున్నారనే వార్తలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అందుకోసం ఒక డైరెక్టర్​ తెగ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. సమంత, నాగచైతన్య కలవబోతున్నది ఓ సినిమా కోసమని.. తన మూవీలో ఇద్దరిని నటింపజేసేందుకు డైరెక్టర్​ నందినిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

నందిని రెడ్డి సిద్ధం చేసిన ఒక కథ నాగ చైతన్యకు బాగా నచ్చిందట. అయితే ఈ సినిమాలో కథానాయికగా సామ్ నే తీసుకోవాలని నందిని రెడ్డి అనుకుంటుందట. అందుకోసం అమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్​నగర్​లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఒకవేళ నిజమైతే.. ఇద్దరు సినిమాకు ఒప్పుకుంటే.. సమంత, నాగచైతన్య అభిమానులకు పండగ అనే చెప్పాలి.

Read Also : Aadhar Mobile Number: ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ కు లింక్ చేశారో మర్చిపోయారా.. అయితే ఇలా తెలుసుకోండి!

Advertisement