Samantha _ After splitting with Naga Chaitanya, Samantha Ready for Second Marriage, Rumours Viral
Samantha : నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉండిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో మూవీలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది. విడాకుల అనంతరం కొన్నిరోజులు డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత.. నెమ్మదిగా తన ప్రొఫెషనల్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఒకవైపు వెబ్ సిరీస్‌ల్లోనూ ఐటెం సాంగ్స్ చేస్తూ మళ్లీ టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. నాగచైతన్యతో పాత జ్ఞాపకాలను తుడిచేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన సమంతకు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగానే వస్తున్నాయి. సమంత ఏం చేసినా విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అయినప్పటికీ సామ్.. ఎక్కడా కూడా అధైర్యం చెందకుండా మరింత స్ట్రాంగ్ గా నిలబడింది.
తనపై చేస్తున్న అసత్య ప్రచారానికి దీటుగా కౌంటర్ ఇస్తూనే ఉంది. అయినప్పటికీ సమంతపై ట్రోల్స్, గాసిప్స్ ఆగడం లేదు.. రోజుకు ఒక గాసిప్ సమంతపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని, త్వరలోనే చైతూ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే అక్కినేని అఖిల్ కూడా నాగ్ సంబంధాలు చూస్తున్నాడని, త్వరలోనే వీరిద్దరి పెళ్లిళ్లు ఒకేసారి జరగనున్నాయంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
Samantha : After splitting with Naga Chaitanya, Samantha Ready for Second Marriage, Rumours Viral
చైతూ తాను ప్రేమించిన ఆ హీరోయిన్ ను చేసుకోవాలని అంటున్నాడని, అయితే ఈసారి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని అమ్మాయిని అక్కినేని ఫ్యామిలీకి కోడలిగా తీసుకురావాలని నాగార్జున గట్టిగా ఫిక్స్ అయినట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇప్పుడు మరో వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తోందని టాక్ నడుస్తోంది. చైతూకు పోటీగా.. తాను కూడా రెండో పెళ్లి సిద్ధమేనని సమంత చెబుతోందని, అయితే తనకు నచ్చిన వ్యక్తి దొరకాలని అంటోందని టాలీవుడ్ కోడైకూస్తోంది.
సామ్ పెళ్లిపై తల్లిదండ్రుల ఒత్తిడి.. ఈసారి నిర్ణయం వారిదే..
మరోవైపు.. సమంత ఇంట్లో పేరంట్స్ రెండో పెళ్లి చేసుకోవాల్సిందిగా గట్టిగా ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. ప్రతిఒక్కరి జీవితంలో తోడు అనేది చాలా అవసరమని, అందుకే విడాకుల తర్వాత ఇలా ఎన్నాళ్లు ఒంటరిగా జీవిస్తావు.. నువ్వు కూడా రెండో పెళ్లి చేసుకోవాలని సామ్ బంధువులు ఒత్తిడి చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఒకసారి విడాకులు తీసుకున్నాంత మాత్రనా జీవితంలో పెళ్లి అనేది చాప్టర్ అంతటితో ఆగిపోదని.. మరో పెళ్లితో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని సమంత పేరంట్స్ నచ్చజేబుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Samantha : After splitting with Naga Chaitanya, Samantha Ready for Second Marriage, Rumours Viral
తన పేరంట్స్ తన జీవితం మంచిగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారని, అందుకే వారి మాటను గౌరవిస్తానని సమంత రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్, కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పూర్తిగా తన సినీ కెరీర్ పైనే ఫోకస్ పెట్టిన సమంత.. ఇప్పటికప్పుడూ నిర్ణయాన్ని చెప్పలేనని, అందుకు కొంత సమయం కావాలని తల్లిదండ్రులను సమంత అడిగినట్టు సమాచారం. చైతూను ప్రేమపెళ్లి చేసుకుంది. అందుకు సామ్ తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు. ఈసారి మాత్రం తన పెళ్లి విషయంలో తల్లిదండ్రులకే వదిలేసినట్టు తెలిసింది.
కాబోయే వాడు ఇలా ఉండాలి : సమంత మనసులో మాట..
తాను రెండో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి.. తన కెరీర్ కి గౌరవం ఇవ్వడంతో పాటు తనను తనకంటే ఎక్కువగా అర్థం చేసుకునేవాడే కావాలని, అలాంటి వ్యక్తి దొరకాలని సమంత తల్లిదండ్రులతో చెప్పినట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఆ వ్యక్తి తనకు తారసపడినప్పుడు తప్పకుండా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని సమంత క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. ఇంతకీ సమంతను రెండో పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరో అనేది తెలియాలంటే సమంత రివీల్ చేసేవరకు వేచి చూడాల్సిందే..
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.