Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర యోగి, ఊర్మిళ ను అవమానించి పంపించడంతో జానకి బాధపడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజు, జానకి మేనల్లుడు బారసాల గురించి జ్ఞానాంబ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ జ్ఞానాంబ ఏమి మాట్లాడకపోవడం తో గోవిందరాజు అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు ఊర్మిళ జానకి వాళ్ళ కోసం గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉంటుంది.అప్పుడు యోగి ఎవరు రారు వెళ్లి బాబు బారసాల చేద్దాం పద అని అనడంతో లేదు,జ్ఞానాంబ అమ్మ వాళ్లు తప్పకుండా వస్తారు వాళ్ళు రాకపోతే ఈ ఫంక్షన్ జరగదు అని మొండిగా పట్టుబడుతుంది ఊర్మిళ.
మరొకవైపు మల్లిక ఎక్కడికి నీ పరుగు అన్న పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ జానకి మాత్రం దిగులుగా కూర్చొని ఉంటుంది. అప్పుడు జానకిని చూసి మల్లిక సంతోష పడుతు వుంటుందీ. ఇంతలో జ్ఞానాంబ ఇంటికి జానకి వాళ్ళ ఫ్రెండ్ బాబుని తీసుకొని వస్తుంది. అప్పుడు జ్ఞానాంబ ఆమెను లోపలికి రమ్మని ఇన్వైట్ చేస్తోంది.
ఆ బాబు ని చూసి జానకి ఆనంద పడుతూ ఉంటుంది. నేను జానకి వాళ్ళ ఫ్రెండ్ ని అని చెప్పడంతో ఆమె ఎందుకు వచ్చిందో అర్థం కాక ఇంట్లో అందరూ అలాగే చూస్తూ ఉంటారు. నేను ఊర్మిళ ఇంటికి వెళితే అక్కడ మీరు రాలేదని ఊర్మిళ బాబు బారసాల చేయను అని పట్టు బట్టుకుని కూర్చుంది అందుకే బాబు ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెబుతుంది.
అప్పుడు మల్లిక అంటే ఏంటమ్మా ఇప్పుడు మా ఇంట్లోనే బాబుకు బారసాల చేయాలా అని అడుగగా అప్పుడు రుక్మిణి అవును అని అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు మల్లిక మరింత రెచ్చిపోయి రుక్మిణీ పై విరుచుకు పడటంతో ఓయ్ ఏంటి చూస్తున్నాను కదా అని ఊరికే రెచ్చిపోతున్నావు.. రుక్కు..ఉక్కు లెక్క.. నువ్వు ఎంత గమ్మున ఉంటే నీకు అంత మంచిది అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది రుక్మిణి.
ఆ తర్వాత రుక్మిణి జ్ఞానాంబ గురించి గొప్పగా పొగుడుతూ ఊర్లో జనాలు మీ గురించి విధంగా అనుకుంటున్నారు అని చెబుతోంది. అప్పుడు రామచంద్ర మేము రాము జానకి గారిని ఒక్కదాన్నే వెళ్దామని చెప్పాము అని అనడంతో అప్పుడు రుక్మిణి ఒక్కటే ఎలా వెళ్తుంది ఇంత మంచి కుటుంబం ఉండగా అని అంటుంది. అలా చివరికి రుక్మిని తన మాటలతో ఇంట్లో అందర్నీ ఒప్పిస్తుంది. అందరూ కలిసి బాబు బారసాలకి ఊర్మిళ ఇంటికి వెళ్తారు. జ్ఞానాంబ కుటుంబం బారసాల కి రావడంతో ఊర్మిల సంతోష పడుతూ ఉంటుంది.