RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న వచ్చేస్తోంది. ఈలోగా జక్కన్న అండ్ టీమ్ భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. మార్చి 19న కర్నాటకలో ఏకంగా ట్రిపుల్ ఆర్ ప్రీ ఈవెంట్ రిలీజ్ ప్లాన్ చేసింది. జక్కన్న రాజమౌళితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విరామం లేకుండా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. రెస్ట్ అన్నదే లేకుండా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా గడిపేస్తున్నారు.
మూవీ రిలీజ్ ముందుగానే ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు చూస్తుంటే అవును అనకుండా ఉండలేరు.. కోట్ల కలెక్షన్లు వసూళ్లు చేయాలంటే ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా అన్నట్టుగా ఉన్నారు.. అసలు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ప్రెస్ మీట్స్.. ఇంటర్వ్యూలతో జక్కన్న, ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉంటున్నారు.
బాహుబాలి రికార్డులను మించేలా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఏపీలో ట్రిపుల్ ఆర్ రూ.110 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. మూవీ రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు తిరగరాస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసినా ఎన్టీఆర్, చరణ్ కటౌట్లు, ప్లెక్సీలే కనిపిస్తున్నాయి.
ఈ రేంజ్ టాక్ చూస్తుంటే.. ట్రిపుల్ ఆర్ సెన్సేషన్ హిట్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో పెరిగిన సినిమా టికెట్ల ప్రకారం.. కనీసం 5 రోజుల వరకు హౌస్ ఫుల్ బోర్డులు పడనున్నాయి. అంటే.. రూ.100 కోట్లు వసూళ్లు చేయడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.
తెలంగాణలో కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తోంది. నైజాం ఏరియాలో రూ.80కోట్ల థియేట్రికల్ పక్కా అంటున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.120 కోట్లను దాటేసింది. ప్రపంచమంతా మార్చి 25న రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ మూవీ రూ.150 కోట్లు వసూళ్లు చేయడమే జక్కన్న టార్గెట్ కనిపిస్తోంది.
Read Also : RRR Movie Ticket Rates : ఆర్ఆర్‌ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంచుకోవచ్చు.. ఎంతంటే?