వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Rithu Chowdary : నాన్న నీ కూతురి దగ్గరికి తిరిగి రా.. జ‌బ‌ర్ద‌స్త్ రీతూ చౌద‌రి ఎమోషనల్ పోస్టు.. అసలేమైందంటే?

Rithu Chowdary : టెలివిజన్ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ (jabardasth) షోలో లేడీ కమెడియ‌న్‌‌గా పేరు తెచ్చుకున్న రీతూ చౌద‌రి (Rithu Chowdary) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రితూ తండ్రి గుండెపోటుతో మృతిచెందారు. తండ్రి మరణంతో రీతూ తీవ్ర మనోవేదనకు గురైంది. నాన్న మరణాన్ని తట్టుకోలేక బోరుమని విలపించింది. నాన్న‌ ఇక లేడు అనే నిజాన్ని తలుచుకుంటూ రీతూ చౌద‌రి ఎమోష‌న‌ల్‌గా పోస్ట్ పెట్టింది. రీతూ చౌదరి తండ్రి మృతిపట్ల టీవీ ప్రేక్ష‌కులు, బ‌జ‌ర్ద‌స్త్ నటులు ... Read more

By Vinod Kumar

Published on: January 24, 2023 6:17 PM

Updated on: January 24, 2023 6:17 PM

rithu-chowdary-jabardasth-lady-comedian-rithu-chowdary-post-viral-after-her-father-passes-away

---Advertisement---

Rithu Chowdary : టెలివిజన్ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ (jabardasth) షోలో లేడీ కమెడియ‌న్‌‌గా పేరు తెచ్చుకున్న రీతూ చౌద‌రి (Rithu Chowdary) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రితూ తండ్రి గుండెపోటుతో మృతిచెందారు. తండ్రి మరణంతో రీతూ తీవ్ర మనోవేదనకు గురైంది.

నాన్న మరణాన్ని తట్టుకోలేక బోరుమని విలపించింది. నాన్న‌ ఇక లేడు అనే నిజాన్ని తలుచుకుంటూ రీతూ చౌద‌రి ఎమోష‌న‌ల్‌గా పోస్ట్ పెట్టింది. రీతూ చౌదరి తండ్రి మృతిపట్ల టీవీ ప్రేక్ష‌కులు, బ‌జ‌ర్ద‌స్త్ నటులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

rithu-chowdary-jabardasth-lady-comedian-rithu-chowdary-post-viral-after-her-father-passes-away
rithu-chowdary-jabardasth-lady-comedian-rithu-chowdary-post-viral-after-her-father-passes-away

తండ్రి మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రీతూ చౌదరి.. తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ‘నాన్నా ఐ ల‌వ్ యూ.. ఇదే నేను నీతో దిగిన ఆఖరి ఫొటో. నిన్ను చాలా మిస్ అవుతున్నాను డాడీ.. ఇలా పోస్ట్ చేయాల్సి వ‌స్తుంద‌ని ఎప్పుడూ ఊహించలేదు.

నువ్వు లేకుండా నేను జీవించలేను. ప్లీజ్.. డాడీ.. నీ కూతురు ద‌గ్గ‌రికి తిరిగి రా’ అంటూ రీతూ చౌదరి ఎమోష‌న‌ల్‌ అయింది. ఇప్పుడు రీతూ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీతూ పోస్టుకు నెటిజ‌న్స్ కూడా స్పందిస్తూ ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also : Jabardasth Rithu Chowdary : త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రీతూ చౌదరి.. జబర్దస్త్ లేడీ కమెడియన్ కాబోయే భర్త ఇతడే…!!

, , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel