Guppedantha Manasu April 12th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..రిషి, ఫణీంద్ర, మహేంద్ర లు మినిస్టర్ కి సన్మానం చేయాలి అనుకుంటారు. అందుకోసం మినిస్టర్ గారిని కలుస్తారు. ఇక మినిస్టర్ సన్మానం చేయడం కోసం ఫ్యామిలీ అందరూ ఒకే చోట కూర్చొని అందుకు సంబంధించిన పనుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ఫనీంద్ర మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ట్రెడిషనల్ లుక్ తో డెకరేట్ చేయాలి, మినిస్టర్ గారిని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించాలి అని అంటాడు.

అప్పుడు రిషి ఏం మాట్లాడకపోవటంతో ఫణీంద్ర ఏమైంది ఋషి అలా ఉన్నావు అని అడగగా ఏమీ లేదు పెద్దనాన్న మినిస్టర్ గారిని సన్మానించిన ఇన్వైట్ చేశాను కానీ మినిస్టర్ నుంచి మనకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కదా అని అనడంతో అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. ఇక ఇంతలో మినిస్టర్ ఫోన్ చేసి నాకు ఈ సన్మానాలు అవి ఇష్టం ఉండవు అని అంటారు.
అప్పుడు వెంటనే ఫణింద్ర, మహేంద్ర బర్త్డే పార్టీ కి రండి సార్ అని పిలుస్తాడు. ఇక అప్పుడు రిషి మొబైల్ మర్చిపోయాను అని చెప్పి మినిస్టర్ ని తనకు ఫేవర్ చేయమని అడిగిన ప్లాన్ ను గుర్తు చేసుకుంటాడు. ఇక మహేంద్ర కు కూడా ప్లాన్ అర్థమై చిరునవ్వు నవ్వుతాడు.
అప్పుడు రిషి జగతి మేడం ను, మీ మహేంద్ర సార్ ను దగ్గరుండి నువ్వే పిలుచుకొని రావాలి అని చెబుతాడు. మరొకవైపు గౌతమ్ ధరణిలో ఇంట్లో వేరే లెవల్లో డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఇంతలో దేవయాని ఆ డెకరేషన్ లో చూసి కుళ్లుకుంటారు ఉంటుంది. ఈ బర్త్డే ఫంక్షన్ ఏదో కాలేజీలోనే పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా మాట్లాడుతుంది.
ఇంతలో వసు, రిషి, ఫణీంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు రిషి ప్రతి ఒక్కరికి ఒక పనిని చెబుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా రిషి, మహేంద్ర పుట్టినరోజు సందర్భంగా సరికొత్త ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ విన్న దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu: సరదాగా బయటికి వసు, రిషి.. సంతోషంలో జగతి, మహేంద్ర..?