Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో హిమ సౌర్య తో గడిపిన క్షణాలు అని గుర్తు చేసుకొని ఫోటోని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది.
హిమ పదే పదే జ్వాలా ఫొటోని చూస్తూ జ్వాలా మాట్లాడిన మాటలు అన్ని గుర్తు చేసుకుని హ్యాపీగా ఉంటుంది. ఇంతలో సౌందర్య అక్కడికి రావడంతో నేను తింగరి అయితే నువ్వు ముసలి తింగరి అని హిమ సౌందర్య ని హత్తుకుని ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నానమ్మ అని సంతోషంగా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక మరొకవైపు ఆనందరావు, నిరూపమ్ లు సౌర్య గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ తరువాత సౌర్య బయట హోటల్ దగ్గర మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి నిరూపమ్, హిమ లు వస్తారు. అప్పుడు డాక్టర్ సాబ్ ఏంటి ఇలా వచ్చాడు అని జ్వాలా అడగగా నీ హుషారు నాకు కొంచెం అప్పుగా కావాలి అని అడుగుతాడు నిరూపమ్.
అందుకోసం జ్వాలాని నీతో పాటి తీసుకెళ్ళు అని చెప్పి జ్వాలా,హిమ చేతులను కలుపుతాడు. ఆ తర్వాత హోటల్ అబ్బాయి హిమ డాక్టర్ కోట్ ని వేసుకొని ఫోటోలు దిగుతాడు. ఆ తరువాత హిమ, జ్వాలా కూడా ఫోటోలు దిగుతారు. మరొకవైపు స్వప్న , ఆనందరావు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆనందరావు కాఫీ బాగా చేస్తావు, పిల్లల్ని బాగానే పెంచావు, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటావ్ కానీ ఎందుకు ఇలా తల్లిదండ్రుల పై కోపంతో మాట్లాడుతావు అని నిలదీస్తాడు ఆనందరావు.
మరొకవైపు సౌర్య,హిమ లు ఆటోలో వెళుతూ ఉంటారు. అప్పుడు హిమ,జ్వాలా తల్లిదండ్రుల గురించి అన్ని తనకు సంబంధించిన వివరాలు అన్నీ అడగడంతో అప్పుడు జ్వాలా,హిమ ఫై సీరియస్ అవుతుంది. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదే అంటూ తన చేతిలో ఉన్న పచ్చబొట్టును చూపిస్తుంది జ్వాలా.
అంతేకాకుండా ఊరి చివర వదిలిపెట్టి ఒక వెళ్ళిపోతుంది. అప్పుడు హిమ ఎంత పిలిచినా కూడా జ్వాలా పడకుండా వెళ్లిపోవడంతో హిమ చాలా బాధపడుతుంది. ఆ తరువాత జ్వాలా తన ఆటోని రెన్యువల్ చేసుకోకపోవడంతో పోలీసులకు పట్టుబడుతుంది. అదే సమయంగా భావించిన ప్రేమ్,జ్వాలా ఒక ఆట ఆడుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ్ జ్వాలా ఆటో నడుపుతూ ఇంతలో స్వప్న చూసి నువ్వు ఏంటిరా ఆటో నడపడం అంటూ ఆశ్చర్యపోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World