Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గౌతమ్, రిషి తో “అంకుల్ కి ఏమీ కాదు రా నేను ఇప్పుడే డాక్టర్ ని కనుక్కున్నాను” అని చెబుతాడు. దానికి రిషి.. డాడీ ని హాస్పిటల్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం అని చెబుతాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్లీ అండ్ ఎమోషన్ కన్వర్జేషన్ బాగుంటుంది.
ఆ తర్వాత రిషి తన డాడీ తో ఉన్న తీపి జ్ఞాపకాలను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈలోపు అక్కడికి వసుధార వచ్చి మహేంద్ర సార్ కి ఏమీ కాదు అని ధైర్యం చెబుతుంది. ఇక రిషి “అవును డాడీ కి ఇలా జరిగితే నాకు ఫోన్ చేయకుండా గౌతమ్ కి ఎందుకు కాల్ చేశారు. నా మీద ఉన్న పాత పగలు ఈ విధంగా తీసుకుంటున్నారా” అని వసును అంటాడు. దానికి వసు, మీకు ఎన్నో సార్లు కాల్ చేశాము సార్ కానీ మీరే తీయలేదు అని చెబుతుంది.
ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వసు, మహేంద్ర గారికి ఏమి కాదు మీరు దిగులు పడకండి అని చెబుతుంది. దానికి రిషి డాడ్ కి ఏమి కాకూడదని నేను కోరుకుంటున్నాను వసు అని తన చేతులు పట్టుకుంటాడు. ఆ తర్వాత డాక్టర్ రిషికి మీ డాడీ ని వీలైనంత వరకు ఏదైనా కొత్త ప్రదేశానికి తీసుకు వెళ్లి అక్కడ ప్రశాంతంగా ఉంచడం వల్ల కొంతవరకు ఆరోగ్యం మెరుగు పడవచ్చు అని చెబుతాడు.
ఆ తర్వాత వసు, మహేంద్ర దగ్గర కూర్చుని ఉండగా మహేంద్ర.. వసుతో ‘మా ఎండి గారు ఏమంటున్నారు. అని నవ్వుకుంటూ అడుగుతాడు. దానికి వసు హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. మీకు నవ్వు ఎలా వస్తుంది సార్ అని అడుగుతుంది. ఇక మహేంద్ర నువ్వు నీ మాట నిలబెట్టుకునే లోపు నేను అప్పటికి ఉంటానో లేదో తెలియదు అని అంటాడు. దానికి వసు మీరు అలా మాట్లాడకండి సార్ అని అంటుంది.
ఆ తర్వాత జగతి.. రిషితో మహేంద్రకు ఇలా జరగటానికి కారణం గురించి ఆలోచించుకుంటూ ఏడుస్తూ చెబుతుంది. దానికి రిషి “నాన్నకు ఇలా జరగడానికి కారణం ఏమిటో నాకు తెలియదు కానీ.. ఈ పరిస్థితిని మీకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి” అని రిషి అంటాడు. దాంతో జగతి మరింత బాగా బాధ పడుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World