...

Guppedantha Manasu: వసుపై కోప్పడ్డ రిషి..జగతి ఏం చేయనుంది.?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మహేంద్ర, రిషి కీ ఫోన్ చేసి ఆటపట్టిస్తాడు. అప్పుడు రిషి మీరు ఈ మధ్య ఎందుకో కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారు డాడ్ అని అంటాడు.

ఈ రోజు ఎపిసోడ్ లో రిషి, వసు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వసు తను ఉంటున్న ఇల్లు గురించి వివరిస్తూ ఉండగా రిషి బొద్దింకల పేరుతో వసు ను ఒక ఆట ఆడుకుంటాడు. ఇక వసు అక్కడున్న వాతావరణం గురించి మాట్లాడుతూ వుండగా వెంటనే రిషి తనను భవిష్యత్తు గురించి ఆలోచించుకోమని చదువుకోమని అంటాడు.

మరొకవైపు గౌతమ్,రిషి,యోగా చేస్తుండగా అప్పుడు గౌతమ్, రిషి తో తన డ్రీమ్ గురించి మాట్లాడతాడు. కానీ రిషి మాత్రం గౌతం చెప్పేది వినకుండా అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మహేంద్ర రావడంతో గౌతం వెళ్లి తన డ్రీమ్ గురించి మహేంద్ర కు చెబుతాడు. ఆ డ్రీమ్ లో వసు కీ ప్రపోజ్ చేస్తున్నట్లు కనిపిస్తాడు. ఇక గౌతమ్ రోజా పువ్వు ఇచ్చి వసు కీ ప్రపోజ్ చేయబోతుండగా ఇంతలో వెనుకనుంచి రిషి వచ్చి పువ్వు కట్ చేస్తాడు.

ఇంతలో రిషి, గౌతమ్ అని గట్టిగా అరవడంతో తన డ్రీమ్ లో నుంచి బయట పడతాడు గౌతమ్. తన డ్రీమ్ లో విలన్ రిషి లాగా ఉన్నాడు అని అనడంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు. కానీ రిషి అవన్నీ గమనిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే మహేంద్ర ఆ విలన్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఏమో అని అనడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరోవైపు వంట గదిలో జగతి, ధరణి మాట్లాడుకుంటూ కాఫీ పెడతారు.

ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని వారిద్దరిపై కోప్పడుతుంది. అప్పుడు జగతి ఏ మాత్రం తగ్గకుండా తాను కూడా ఆ ఇంట్లో కోడలిని అన్నట్లుగా మాట్లాడడంతో ధరణి షాక్ అవుతుంది. అప్పుడు కాఫీ తాగుతూ ఇన్ని రోజులు కానీ మంచి అద్భుతంగా కాపీ పెట్టావు ధరణి అని పొగడగా వెంటనే జగతి నేనే కాఫీ పెట్టాను అక్కయ్య అంటూ సమాధానం ఇస్తుంది. అప్పుడు దేవయాని ఎదిరించి మాట్లాడటంతో జగతి మాత్రం వెటకారంగా మాట్లాడుతుంది.

ఇక మరొక వైపు రిషి క్లాసు లో ఉండగా ఇంతలో నోటిస్ వస్తుంది. అది చూసి వసుధార హాలిడే అనుకుని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి అది స్కాలర్ షిప్ టెస్ట్ అని వసు నిరాశపడుతుంది. కాలర్ షిప్ టెస్ట్ ఎవరెవరు పాల్గొంటారు అని అనడంతో అందరూ చేతులు ఎత్తినా కూడా వసు మాత్రం చేతులు ఎత్తదు. దీనితో రిషి, వసు పై కోప్పడతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.