Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి తనని అవాయిడ్ చేస్తున్నాడు అంటూ సాక్షి ఇంట్లో అందరి ముందు గోల గోల చేస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి నీకు వసుధార ప్రాధాన్యత అయ్యింది. అంతేకాకుండా వసుధార స్నేహం కోసం నువ్వు తహతహలాడుతున్నావు అని అనడంతో ఆ మాటకు కోపంతో రిషి షట్ అప్ అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు రిషి నేను నీకు దక్కను అని తెలిసి నువ్వు నిన్ను కాపాడుకోవడానికి వేరే వాళ్ళను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని సాక్షిపై కోప్పడతాడు.
అప్పుడు రిషి, వసు కలిసి ఉన్న ఫోటోలను చూపిస్తుంది సాక్షి. అప్పుడు జగతి మాట్లాడుతూ ఇన్నాళ్లుగా గుర్తుకురాని రిషి ఇప్పుడు సడన్ గా ఎందుకు గుర్తుకు వచ్చారు అని సాక్షి నిలదీస్తుంది. రిషి ఏమిటో తన జీవితం ఏమిటో తనకు క్లారిటీ ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి పాఠాలు చెప్పనవసరం లేదు అంటూ సాక్షి కి బుద్ధి చెబుతుంది.
అప్పుడు సాక్షి మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది ఆ హక్కు నాకు ఉంది అని అంటుంది. ఇంతలో అక్కడికి వసు వస్తుంది. ఇక అక్కడి నుంచి తన తల్లిదండ్రులను పిలుచుకొని సాక్షి వెళ్ళిపోతుంది. ఆ తరువాత రిషి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పాలి కదా అసలు నువ్వు మా ఇంటికి రావడమే తప్పు అన్న విధంగా మాట్లాడుతూ కోప్పడతాడు.
రిషీ మాటలకు వసు హర్ట్ అయితే అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జగతి, వసు కి జరిగినదంతా వివరిస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపు జగతి, వసు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత జగతి, రిషి దగ్గరికి వెళుతుంది.వసు ను మీరు లవ్ చేస్తున్నారని అప్పుడే చెప్పాను కదా అని అంటుంది జగతి. ఇక రేపటి ఎపిసోడ్ లో టికెట్ తీసుకున్నావా అని వసుని అడగగా తీసుకున్నాను అని చెబుతుంది. ఎప్పుడు వెళ్తున్నావు అని అడగడంతో వెళ్లడానికి ఏంటి సార్ మీరు రారా అని అడగగా నువ్వేమీ చిన్నపిల్లవు కాదు కదా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World