Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సాక్షి పర్మిషన్ లేకుండా కాలేజీ లోకి వచ్చినందుకు రిషి కోప్పడతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి అటెండర్ ను పిలిచి ఎవరిని పడితే వారిని కాలేజీ అవర్స్ లో ఎవరిని పడితే వారిని లోపలికి పంపించొద్దు అంటూ అరుస్తాడు. అప్పుడు సాక్షి నాకు ఇంతకంటే పెద్ద ఇన్స్టల్ ఇంకొకటి లేదు అని ఫీల్ అవుతుంది. ఆ తరువాత రిషి ఇలా ఇంకెప్పుడు రాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత సాక్షి, జగతి తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మహేంద్ర వస్తాడు. అప్పుడు సాక్షి మీరందరూ కూడా రిషి కె సపోర్ట్ చేస్తున్నారు అని అంటుంది. రిషి నన్ను ఎన్ని సార్లు అవమానించిన వద్దన్నా నేను రావడం మానను అని చెప్పి సాక్షి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు కాలేజీలో వసు నోట్ బుక్ లో లెటర్ రాస్తూ కనిపిస్తుంది.
ఇంతలో రిషి అక్కడికి వచ్చి కాలర్ షిప్ పోటీలో పాల్గొంటున్నం దుకు అందరితో క్లబ్ కొట్టిస్తాడు. అప్పుడు రిషి సాక్షి ని చూసే ఎందుకు నాకు కోపం వస్తుంది. కానీ వసు ని చూస్తే నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది అని మనసులో అనుకుంటాడు.
ఇక మరొకవైపు సాక్షి దేవయానికి జరిగిన విషయం గురించి చెప్పి బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు దేవయాని కొన్ని మాటలు చెప్పి సాక్షిని ప్రోత్సహిస్తుంది. మరొకవైపు వసు కి రిషి నోట్ బుక్ ఇవ్వబోతుండగా లెటర్ బయటపడుతుంది. ఆ లెటర్ ను చూసిన రిషి షాక్ అయ్యి ఈ లెటర్ నీకు ఎక్కడిది అని అడగడంతో జగతి మేడం నాకు వాట్సాప్ లో సెండ్ చేశారు అని చెబుతుంది.
అప్పుడు రిషి ఎవరో రాసిన లవ్ లెటర్ ని ఇలా బుక్ లో పెట్టుకుని తిరగడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. మరొకవైపు రిషి ఇంట్లో అందరూ రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు రిషి వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుండగా అప్పుడు సాక్షి ఆగు రిషి ఈరోజు నీ మనసులో నా స్థానం ఏంటో తెలియాలి అని అడుగుతుంది.
అప్పుడు రిషి నువ్వు నా మనసులో లేవు అని డైరెక్టుగా ముఖం మీద చెప్పేస్తాడు. అప్పుడు సాక్షి మరింత రెచ్చిపోతూ నీకు వసు అంటే చాలా ఇష్టం ఈ ప్రపంచం వసు నే కదా అని అంటుంది. దానికి రిషి కోప్పడతాడు. ఇంతలో వసుధార అక్కడికి వస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World