Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ ఇంటి నుంచి వెళ్లి పోవడానికి సిద్ధపడుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ఇంటి నుంచి వెళ్లి పోవాలి అనుకున్నా హిమకు అడ్డుపడిన సౌందర్య చేసిందంతా చేసి, మా పరువు తీసి ఇప్పుడు సూట్ కేస్ తీసుకొని బయలుదేరుతాను అంటే నేను ఎలా ఊరుకుంటాను అని అనుకున్నాను అని అంటుంది.
అంతేకాకుండా పెళ్లి ఎందుకు వద్దు అన్నావు చెప్పిన తర్వాత ఇంట్లో నుంచి కదలాలి అని సౌందర్య పట్టుబట్టింది. నీకు ఎంత టైం కావాలి అన్న తీసుకో కానీ నాకు మాత్రం నిజం తెలియాలి అని సౌందర్య అంటుంది. మరొకవైపు జ్వాలా పాటలు పెట్టుకుని ఆనందంతో డాన్సులు వేస్తూ ఉంటుంది.
అది చూసిన ఇంద్రమ్మ దంపతులు ఆశ్చర్యపోతారు. అప్పుడు జ్వాలా దగ్గరికి వెళ్లి ఏంటి అమ్మ ఆనందం అని అడగగా అప్పుడు వాళ్ళ ఆనందంలో ఇంద్రమ్మ దంపతులకు అవసరాలకు డబ్బు ఇవ్వటమే కాకుండా వచ్చీరాని ఇంగ్లీషులో అదరగొడుతుంది. మరొకవైపు స్వప్న,నిరూపమ్ చేసిన పనికి మండిపడుతూ ఉంటుంది.
నువ్వు నైట్ ఆటోలో దిగినప్పుడు నీ మీద ఉన్న నమ్మకం పోయింది అని నిరూపమ్ తో అంటుంది. ఒక దరిద్రం పోయింది అనుకుంటే మరొక దరిద్రం చుట్టుకుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది స్వప్న. నువ్వు హిమ గురించి ఆలోచించకు అని స్వప్న నిరూపమ్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది.
మరొకవైపు జ్వాల ఆటో నడుపుతూ నా జీవితానికి ఏమి కాదు డాక్టర్ సాబ్ ఉన్నాడు అని మురిసిపోతూ ఉంటుంది. దారిలో వెళ్తుండగా నిరూపమ్ అక్కడ ఉంటాడు. అప్పుడు నిరూపమ్ రాత్రి నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టానా అని అడుగుతాడు. లేదు డాక్టర్ సాబ్ అని అంటుంది జ్వాలా.
అప్పుడు జ్వాలా మీరు మళ్ళీ ఎప్పుడూ మందు తాగుతారు అని కామెడీగా అడుగుతుంది. మరొక వైపు హిమ,నిరూపమ్ దగ్గరికి వెళ్ళగానే నిరూపమ్ కోప్పడతాడు. మరొకవైపు సౌందర్య కోపంగా జ్వాలా ఇంటికి వచ్చి కార్లో ఎక్కించుకుని వెళ్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.