...

Karthika Deepam: తానే సౌర్య అని ఒప్పుకున్న జ్వాలా.. ఆనందంలో సౌందర్య..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ, నిరూపమ్ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరుకుంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో నిరూపమ్, జ్వాలా మాట్లాడుకుంటూ ఉండగా,అప్పుడు నిరూపమ్, జ్వాలా కి థాంక్స్ చెబుతాడు. అప్పుడు జ్వాల మనలో మనకు థాంక్స్ లు ఉండకూడదు అని చెబుతోంది. మరొకవైపు హిమ హాస్పిటల్ కి వెళ్ళాగా అందరూ హిమ ను విచిత్రంగా చూస్తూ ఉంటారు.

ఇంతలో నిరూపమ్ అక్కడికి వచ్చి హిమ ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. దాంతో హిమ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు జ్వాలా సత్యకు అన్నం తీసుకొని వచ్చి వడ్డిస్తూ ఉంటుంది. నన్ను ఆటో నడిపే అమ్మాయిలా చూస్తున్నారు మీ ఇంటి కోడలిగా ఒప్పుకుంటారో లేదో అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

మరొకవైపు నిరూపమ్ తో మాట్లాడడానికి హిమ వెళ్ళగా నిరూపమ్ మాత్రం పట్టించుకోడు. ఏదో ఫైల్ చూస్తూ ఉండగా సినిమా కోపంతో ఆ ఫైల్ లాక్కుంటుంది. ఇక అందులో తన ఫోటోలు ఉండటం చూసి హిమ చాలా బాధపడుతుంది. మరొకవైపు సౌందర్య ఏదో టెన్షన్ లో కారు నడుపుతూ వెళ్లి ఒక ముసలావిడ గుద్దుతుంది.

ఆ తర్వాత ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఆ తర్వాత ముసలావిడ ఇంటికి తొందరగా పండ్లు తీసుకుని వెళ్లగా అది గమనించిన సౌర్య సౌందర్య ను ఫాలో అవుతుంది. ఇక సౌర్ మాటలకు కోపంతో సౌందర్య,జ్వాలా చేయి పట్టుకొని ఒక దగ్గరికి తీసుకుని వెళ్తుంది.

ఇక ఆ తరువాత సౌందర్య మీ నాన్న ఎవరు? వాడు మనిషేనా ఒక అమ్మాయి ఆటో నడుపుతూ ఉంటే ఏం చేస్తున్నాడు అని జ్వాలా వాళ్ళ నాన్నను తిడుతుంది సౌందర్య. అప్పుడు మా నాన్నను ఏమి అనద్దు అని
అంటుంది జ్వాలా.

రేపటి ఎపిసోడ్ లో జ్వాలా సౌందర్య కి ఫోన్ చేసి తానే సౌర్య అని ఒప్పుకుంటుంది. ఆ మాటతో సౌందర్య ఆనందపడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.