VJ Chaitra case: తమిళ బుల్లి తెర నటి వీజే చైత్ర ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె బలవన్మరణానికి పాల్పడిన 17 నెలల తర్వాత ఆమె కేసులో మరోసారి విచారణ జరగాలని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. సీఎంను కలిసి తన కూతురు మృతిపై నిజానిజాలను నిగ్గు తేల్చేలా మరోసారి దర్యాప్తు జరిపించాలని కోరినట్లు సమాచారం. అయితే డిసెంబర్ 9వ తేదీ 2020న హోటల్ రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో వీజే చైత్ర కనిపించింది.
అయితే ఆమె ఆత్మహత్య కేసులో చిత్ర భర్త హేమంత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను హోటల్ నుంచి బయటకు వెళ్లి తిరిగొచ్చే లోపు తన భార్య చిత్ర, ఆత్మహత్య చేసుకుని కనిపించిందని హేమంత్ రవి తెలిపారు. అయితే ఆమె మృతికి తాను కారణం కాదని వివరించే ప్రయత్నం చేసారు. ఫిబ్రవరి 15న బెయిల్ పై హేమంత్ విడుదల అయ్యాడు. తన భార్య ప్రాణం పోవడానికి కారణమైన వాళ్లు కూడా చచ్చిపోవాలని ఇటీవలే ఆయన వ్యాఖ్యలు చేశారు.