...

Pllavi dey suicide: సీరియల్ నటి పల్లవి డే ఆత్మహత్య.. ఏమైందో తెలుసా?

Pllavi dey suicide: ప్రముఖ బెంగాలీ నటి, టీవీ యాక్టర్ పల్లవి డే అనుమానాస్పదంగా మృతి చెందింది. కోల్ కతా గార్పా ప్రాంతంలోని తన ఫ్లాట్ లో ఆదివారం శవమై కనిపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కోల్ కతాలోని ఎమ్ఆర్ బంగూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

అయితే పల్లవి ఆత్మహత్యకు కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదు. అనంతరం ఆమె మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి పంపించారు. నటి పల్లవి మృతి పట్ల ఆమె సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఇంత చిన్న వయసులోనే చనిపోయిన సీరియల్ నటి పల్లవి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నారు. పల్లవి అభిమానులు ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.