Guppedantha Manasu April 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. నిన్నటి ఎపిసోడ్ లో స్కాలర్షిప్ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నవారు చేతులు పైకెత్తండి అని రిషి చెప్పగా వసు మాత్రం ఏమి మాట్లాడదు.
ఈరోజు ఎపిసోడ్ లో నేషనల్ స్కాలర్షిప్ విషయంలో వసు భయపడవద్దు అంటూ ప్రోత్సహిస్తూ ఉంటాడు రిషి. అలా క్లాసులో వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా వసు అక్కడ నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత రిషి వెళ్ళి వసు ఉంటున్న రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వసు నా సామ్రాజ్యాన్ని చూడండి సార్ అని అనగా అప్పుడే చూసాను కదా అని రిషి అంటాడు.
ఇక అప్పుడు రిషి,వసుతో మాట్లాడుతూ ఇవన్నీ పక్కనపెట్టి చదువుపై దృష్టి పెట్టు అని అంటాడు. ఇంతలో వసుధార కాఫీ తాగండి సార్ అని అనడంతో, కొద్దిసేపటికి రెస్టారెంట్లో పని చేయడానికి వెళ్తావు కదా అక్కడ తాగుతాను అని చెబుతాడు. ఇక ఆ తర్వాత వసు పనిచేసే రెస్టారెంట్ కీ వెళ్లి కూర్చుంటాడు.
అప్పుడు వసు,రిషి కోసం కాఫీ తీసుకొని రాగా నీకు ఒక మెసేజ్ పంపాను రూమ్ కి వెళ్ళి తీరిగ్గా చదువుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, రెస్టారెంట్ మేనేజర్ తో మాట్లాడుతూ వసుని బాగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మేనేజర్ రిషి చెప్పిన మాటలను వసుకి చెప్పడంతో వసు ఆనందంగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత రూమ్ కీ వెళ్ళిన వసు మెసేజ్ ఓపెన్ చేసి చూడగా,రిషి పెట్టిన ఫైల్స్ తనకి అర్థం కాక పోవడంతో జగతికి ఫోన్ చేసి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో వసుకీ రిషి ఫోన్ చేస్తుండగా కంటిన్యూ గా బిజీ వస్తుంటుంది. ఇంతలోనే అక్కడికి గౌతమ్ నా ఏంజెల్ అంటూ ఫోన్ మాట్లాడుతూ రావడంతో వసు,గౌతమ్ తో ఫోన్ మాట్లాడుతుంది అని భావించిన రిషి,గౌతమ్ ఫోన్ ని చెక్ చేస్తాడు.
మరొకవైపు వసు క్లాసు కీ లేట్ గా వచ్చినందుకు రిషి క్లాస్ పీకుతాడు. ఇంతలో వసుకి పనిష్మెంట్ కింద ఒక లెక్క ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పగా వసు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఎపిసోడ్ లో వసు,రిషి, మహేంద్ర జగతిలో కార్లో వెళ్తూ ఉంటారు. ఇక వెనుకవైపు మహేంద్ర,జగతి, వసు కూర్చుని ఉంటారు. అప్పుడు రిషి క్యాబ్ డ్రైవర్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..
Read Also : Guppedantha Manasu: వసుపై కోప్పడ్డ రిషి..జగతి ఏం చేయనుంది.?
Tufan9 Telugu News And Updates Breaking News All over World