...

Ram lakshman: సూపర్ స్టార్ మహేష్ బాబునే చాలా కష్ట పెట్టారట.. పాపం!

Ram lakshman: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరశురాం తెరకెక్కించిన సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతోంది.

ఈ క్రమంలోనే మే 7వ తేదీ అంటే నిన్న యూసుఫ్ గూడలో జరిగిన పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ… కరోనాను దాటుకొని ఈ సినిమా ముందుకొస్తుంది. బాబుతో మాకు ఇది నాలుగో సినిమా అని… సినిమా ఇంటర్వెల్ క్లైమాక్స్ దగ్గ మహేష్ బాబుని చాలా కష్టపెట్టామని రామ్ లక్ష్మణ్ వివరించారు. అలాగే అభిమానులని మెప్పించడానికి మేము చాలా కష్టపెట్టాం. నాతో పాటు మా టీం అంతా ప్రాణాలకి తెగించి మరీ మంచి ఫైట్స్ కోసం కష్టపెడతారని వివరించారు.