Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన RRR సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15 వ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇకపోతే రామ్ చరణ్ సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ ఈయనకు భక్తిభావం ఎంతో ఎక్కువ అని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తరచూ దేవాలయాలను దర్శించడం అలాగే దీక్ష చేయడం మనం చూస్తున్నాము.
ఈ విధంగా రామ్ చరణ్ కి భక్తి భావం ఎక్కువ అని మరోసారి నిరూపించుకున్నారు.ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో స్వయంగా రామ్ చరణ్ శివుడికి సేవ చేస్తూ కనిపించారు. శివుడికి స్వయంగా అభిషేకం చేస్తూ దైవ భక్తిని చాటుకున్నారు. ఇలా రామ్ చరణ్ స్టార్ హీరో అయినప్పటికీ ఎంతో సింప్లిసిటీని ప్రదర్శిస్తూ ఈయన శివుడి సన్నిధిలో ఆయనకు పూజలు చేస్తున్నారు.ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా అభిమానులు రామ్ చరణ్ సింప్లిసిటీ కి ఫిదా అవుతున్నారు.