Radhe Shyam Trailer : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాష్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం సాయంత్రం 6 గంటలకు రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ సందర్భంగా రాధే శ్యామ్ మూవీ ట్రైలర్ స్వయంగా ప్రభాష్ ఫ్యాన్స్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. మాగ్నమ్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈవెంట్‌కు హైదరాబాద్‌లో అభిమానులతో సందడిగా మారనుంది.
ఈ మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా దేశవ్యాప్తంగా 40,000 మంది అభిమానులు పాల్గొననున్నారు. ప్రభాస్, పూజా హెగ్డేతో పాటు గ్రాండ్ సెలబ్రేషన్‌లో అభిమానులు హాజరుకానున్నారు. దీనిపై బ్యూటీ పూజా హెగ్డే ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.. రంగస్థలం సెట్ అయింది.. ప్రేమకథ ప్రారంభం కానుంది. #Radhe Shyam Trailer tomorrow విడుదల కానుంది.
కోవిడ్-19 ప్రోటోకాల్‌లను పాటిస్తూనే దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి దాదాపు 40,000 మంది ప్రభాష్ అభిమానులు ఈవెంటుకు హాజరవుతారు. డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లకు మాత్రమే ఈవెంట్‌కి ప్రవేశానికి అనుమతించనున్నారు. రామోజీ స్టూడియోస్‌లో ఓపెన్ గ్రౌండ్‌లో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈవెంట్ కు హాజరయ్యేవారు శానిటైజర్‌లు, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు.
The stage is set. The love story is about to begin. #RadheShyamTrailer out tomorrow.
AdvertisementWatch live 🔗 https://t.co/jy7oMUE15U
#Prabhas @hegdepooja @director_radhaa #BhushanKumar @TSeries @UV_Creations @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamTrailerOnDec23 pic.twitter.com/fmlWvOO3AQ— Pooja Hegde (@hegdepooja) December 22, 2021
Advertisement
ప్రభాస్ చివరిసారిగా 2019లో సాహో మూవీలో కనిపించాడు. మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సినిమాలకు ప్రభాష్ దూరంగా ఉన్నాడు. బాహుబలి ఫ్యాన్స్ తమ అభిమాన తారను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్ థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. భూషణ్ కుమార్, వంశీ ప్రమోద్ నిర్మించిన రాధే శ్యామ్ మూవీ వచ్చే ఏడాది 2022 జనవరి 14న రిలీజ్ కానుంది.
Read Also : Pushpa Samantha Song : పుష్పలో స్పెషల్ సాంగ్ ‘సమంత’ చేయనన్నదట.. కానీ..!