...

Actress Ragini : నన్ను పడుకుని అయినా డబ్బులు తేవాలని టార్చర్ చేశాడు..!

Actress Ragini : సీనియర్ నటి రాగిణి గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో తెలియని వారు ఉండరు. మొదట బుల్లితెర నటిగా రాగిణి పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమాల్లో అవకాశాలు పొంది తానేంటో నిరూపించుకుంది. రాగిణికి సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది.

ఆ విధంగా తన కెరీర్ ఎన్నో సినిమాలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేంజ్‌కు ఎదిగింది. రాగిణి సెంటిమెంటల్ ఓరియంటెడ్ పాత్రల్లో అద్భుతంగా నటిస్తుంది. దాదాపు 400లకు పైగా సీరియల్స్ అండ్ 100కు పైగా చిత్రాల్లో నటించింది. ఈమె నటనకు గాను పలు అవార్డులను సైతం అందుకుంది. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాగిణి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

సీనియర్ నటి రాగిణికి ఐదుగురు అక్కాచెల్లెల్లు అంట.. ఆమెనే చిట్టచివరి సంతానం. ఇంట్లో జనాభా ఎక్కువ కావడంతో తల్లిదండ్రులకు కుటుంబ పోషణ భారంగా మారిందట.. దీంతో అందరూ సంపాదన పై దృష్టి సారించారని తెలిపింది. నలుగురు సోదరులు సీని రంగంలోనే స్థిరపడ్డారు. తనకు చిన్న వయసులోనే వివాహం జరిగిందని.. తన భర్త మద్యానికి అలవాటు పడి డబ్బులు మొత్తం జల్సాల కోసం ఖర్చు చేసేవాడని తెలిపింది.

తనకు తాగేందుకు డబ్బులు ఇవ్వాలని ఆమెను బాగా ఇబ్బందులకు గురిచేసేవాడట.. నన్ను పడుకుని డబ్బులు సంపాదించి తెచ్చి ఇవ్వాలని వేధింపులకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వ్యభిచారం చేసేందుకు కూడా తాను సిద్ధపడ్డానని.. చివరకు తన భర్త నుంచి దూరంగా వెళ్లిపోయి నటనపై దృష్టి సారించానని వెల్లడించింది. ఆ తర్వాత ఒక బాబును దత్తత తీసుకుని పెంచుకున్నట్టు పేర్కొంది. తన కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పింది.

రాగిణి సినిమా రంగంలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు పలు సూచనలు చేసింది. అందం, అభినయం, టాలెంట్ మాత్రమే ముఖ్యం కాదని.. ఎవరితో ఎలా నడుచుకోవాలో ముందు నేర్చుకోవాలన్నారు.ఈ విషయంపై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవని పేర్కొంది. ఇటీవల కొందరు చాన్సులు ఇస్తామని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వాడుకుంటున్నారని చెప్పింది. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Read Also : Pushpa Samantha Song : పుష్పలో స్పెషల్ సాంగ్ ‘సమంత’ చేయనన్నదట.. కానీ..!