Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటు దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి నువ్వు మా అమ్మవేనా అంటూ రాధను ప్రశ్నించడంతో రాధా ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో పిల్లలు ఇద్దరరు ఆదిత్యను చెరుకు రసం బండి దగ్గరికి తీసుకు వచ్చి చెరుకు రసం తాగమని బతిమాలాడుతూ ఉంటారు. కానీ ఆదిత్య మాత్రం చెరుకు రసం తాగడానికి నిరాకరిస్తాడు. ఆదిత్య ఇబ్బందిగా ఫీల్ అయ్యి అక్కడినుంచి వెళ్ళి పోతూ ఉండగా అంతలో మాధవ కారు దగ్గరికి వచ్చి తన మాటలతో వార్ణింగ్ ఇచ్చినట్లుగా కనిపించడంతో వెంటనే ఆదిత్య అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
రాధను చెరుకు రసం తాగమని మాధవ బ్రతిమలాడుతాడు. మరొకవైపు ఆదిత్య నేరుగా స్కూల్ దగ్గరికి వెళ్లి, చిన్మయి దేవి ల అడ్మిషన్ రిజిస్టర్ అడుగుతాడు. అడ్మిషన్ రిజిస్టర్ లో తల్లి పేరులో ఎవరున్నారో చూడటానికి ఈ విధంగా ఎంక్వైరీ చేస్తున్నాను అని అనుకుంటాడు. ఇక రిజిస్టర్ లో దేవి, చిన్మయి ల తల్లి తండ్రి స్థానంలో రాధ,మాధవ అని ఉండటంతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరొకవైపు దేవి, మాధవ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచనలో పడుతుంది.
అప్పుడు దేవి తన మనసులో ఇంతకీ నా తల్లి ఎవరు.. చనిపోయిన ఆమేనా లేక ఇప్పుడున్న మా అమ్మ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాధతో ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరు అని దేవి ప్రశ్నించడంతో రాధా సమాధానం చెప్పి, దేవి అడిగిన ప్రశ్నలకు ఒక్క సారిగా షాక్ అవుతుంది. మరొకవైపు పిల్లల స్కూల్ హెడ్ మాస్టర్ మాధవ కు ఫోన్ చేసి ఆదిత్య స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లల గురించి ఎంక్వయిరీ చేశాడు అని చెప్పడంతో మాధవ షాక్ అవుతాడు.
ఆ తరువాత మాధవ రాధా దగ్గరికి వెళ్లగా అక్కడ రాధ కోపంతో లక్ష్మీ వాళ్ళ అమ్మ నాన్న లతో ఎందుకు అలా మాట్లాడావు అని ప్రశ్నించగా, సమాధానం చెప్పడానికి మాధవ తడబడతాడు. ఊర్లో వాళ్ళ కోసం తాను ఆదిత్యకు మోసం చేయను అని నీకు భార్య స్థానంలో ఉండను అని గట్టిగా చెబుతోంది. వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన రామ్మూర్తి వేడుకకు సిద్ధం కావాలి అని కాస్త గట్టిగా చెప్పి వెళ్ళిపోతాడు. కానీ రాధ మాత్రం నేను గుడి కి రాను అని గట్టిగా చెబుతోంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World