Pushpa Box Office Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప ది రైజ్ (Pushpa The Rise).. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ భారీ అంచనాలతో రిలీజైన పుష్ప అన్నీ చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా పుష్ప రికార్డుల మోత మోగించింది. 2022 కొత్త ఏడాదిలోనూ పుష్ప బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది.
పుష్ప విడుదలైన 16వ రోజునే హిందీలో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తొలిరోజు కలెక్షన్లను దాటేసింది. హిందీ వెర్షన్ పుష్పలో ఒక్కరోజులో అతిపెద్ద కలెక్షన్ ఇదే.. బాలీవుడ్‌లో కలెక్షన్ల రికార్డులను తిరిగరాస్తోంది పుష్ప.. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ మూవీకి 56 కోట్లు వచ్చేశాయి. మరో 75 కోట్ల దిశగా పుష్ప దూసుకుపోతోంది.
Pushpa Box Office Collections : హిందీలోనూ తగ్గేదేలే.. పుష్స కలెక్షన్ల మోత…!

బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కరోనా రెండో వేవ్ తర్వాత అత్యధిక స్థాయిలో వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు నెలకొల్పింది. చాలాచోట్ల పుష్ప ఆడుతున్న థియేటర్లలోనూ హౌజ్ ఫుల్ ఫుల్ బోర్డులు పెట్టేశారంటే పుష్ప రికార్డులు మాములు లేదని కనిపిస్తోంది. మొత్తం మీద ఇప్పటివరకూ పుష్పకు రూ. 300 కోట్లు వచ్చాయట. అల్లు అర్జున్ మాస్ స్టామినా ఇదే..
పుష్పరాజ్ పర్ఫార్మెన్స్‌కు బాలీవుడ్ ఫిదా అయిపోతుంది.. అల్లు అర్జున్ కోసమే వెళ్లి చూసేవాళ్లు ఎక్కువ..సినిమా థియేటర్లకు క్యూ కట్టేస్తున్నారు ఆడియన్స్. ఒక్క తెలుగులోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ పుష్ప రికార్డుల మోత మోగిస్తోంది. హిందీ, తమిళంలో పుష్పకు రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే దూకుడుతో మరో రూ.350 కోట్ల వసూలు చేసే దిశగా పుష్క వేగంగా దూసుకెళ్తోంది.
Read Also : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్… ఆ స్థానం నాకు వద్దు..!