...

Comedian Prudhvi Raj : పవర్ స్టార్ భీమ్లా నాయక్ పై పొగడ్తల వర్షం కురిపించిన కమెడియన్ పృధ్వీరాజ్..!

Comedian Prudhvi Raj : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన సినిమా ” భీమ్లా నాయక్ “. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి… త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా చేయగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటించింది. మలయాళంలో సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ కు తెలుగు రీమేక్‏గా ఈ చిత్రం రూపొందింది.

కాగా ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. మరోవైపు పవన్ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నటుడు పృథ్వీ రాజ్ భీమ్లా నాయక్ సినిమా ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్‌ కమెడియన్ గా పృద్వీరాజ్‌ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీలో కీలకనేతగా ఓ వెలుగు వెలిగారు. తాడేపల్లిగూడెంలో ఓటమి, ఆడియో టేపులతో వైసీపీలో గౌరవంతో పాటు పదవిని పోగొట్టుకున్నారు. ఆ ఎఫెక్ట్‌తోనే పృధ్వీరాజ్‌ వైసీపీలో ఫేడవుట్‌ అయినట్లుగా తెలుస్తోంది.

అయితే పాలిటిక్స్‌లో ఫెయిల్‌ అయినప్పటికి కమెడియన్‌గా అడపాదడపా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంటున్నారు పృధ్వీరాజ్. ఇప్పుడు తాజాగా భీమ్లా నాయక్ సినిమాను వీక్షించిన ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‏ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర వ్యక్యాలు చేశారు. క్లైమాక్స్, పవర్ స్టార్, రానా కాంబోలో వచ్చిన సన్నివేశాలు గొప్పగా ఉన్నాయి. ఒక ప్రేక్షకుడిలా ఈ సినిమాను ఫుల్ ఎంజయ్ చేశాను. ఇంత అద్భుతమైన సినిమాలో నేను నటించలేదని బాధ పడ్డాను. భీమ్లా నాయక్ సినిమా తనకు ఎంతో నచ్చిందని… పవన్ కళ్యాణ్‏కు దిష్టి తగలకూడని అన్నారు.

Read Also : MLA Roja Nagababu : నాగబాబుకు ఎమ్మెల్యే రోజా కౌంటర్.. పవన్‌పై సంచలన కామెంట్స్..!