Hyderabad Blast : తెలంగాణ రాష్ట్రం మరోసారి బాంబు పేలుడు ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో బాంబు పేలుడు కలకలం రేపుతోంది. ఆనంద్ నగర్ పారిశ్రామిక వాడలో బాంబు పేలింది. పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరిస్తుండగా బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ బాంబు పేలుడులో సుశీలమ్మ అనే పారిశుధ్య కార్మికురాలు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలలోకి వెళ్తే…
రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆనంద్ నగర్ పారిశ్రామిక వాడకు సమీపంలో చెత్త కుండీలో ఈ పేలుడు సంభవించింది. దీంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కథనం ప్రకారం.. చెత్తను సేకరించేందుకు వెళ్లిన సుశీలమ్మ అనే పారిశుధ్య కార్మికురాలు తన భర్తతో కలిసి ఆటోలో ఆనంద్ నగర్ పారిశ్రామిక వాడకు వెళ్లింది. చెత్త సేకరిస్తుండగా ఆ సమయంలోల ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ పేలుడులో సుశీలమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త రంగమునికి తీవ్ర గాయలపాలయ్యారు. దీంతో స్థానికుల సాయంతో అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానికుల కధనం మేరకు… పేలుడు జరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని ఆ సమయంలో సుశీలమ్మ మృతదేహం ఘటన స్థలిలో చిందరవందరగా పడి ఉందని తెలిపారు. చెత్తను సేకరించి, వాటిని అమ్ముకుని ఆ దంపతులు జీవనం సాగిస్తారు అని చెబుతున్నారు. అయితే, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకుని…పేలుడు సంభవించడానికి గల కారణాలను ఆయన ఆరా తీశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
Read Also : MLA Roja Nagababu : నాగబాబుకు ఎమ్మెల్యే రోజా కౌంటర్.. పవన్‌పై సంచలన కామెంట్స్..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World