Premi Vishwanath: బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడ, మగా తేడా లేకుండా వంటలక్క, డాక్టర్ బాబు సీరియల్ ను ఫాలో అయ్యేవారు. అయితే ఒకప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక దీపం సీరియల్ సగానికి సగం పడిపోయింది. ఈ క్రమంలోనే సీరియల్ దర్శకుడు టీఆర్పీ పెంచేందుకు సరికొత్త ట్విస్ట్ ఇచ్చాడు. గత కొంత కాలంగా కార్తీక దీపం సీరియల్ లో వంటలకన్న, డాక్టర్ బాబు చనిపోయినట్లుగా చూపించారు. కానీ ఇప్పుడు దీప రీఎంట్రీతో సీరియర్ టీఆర్పీ పెంచాలని చూస్తున్నారు. మొన్నటికే మొన్న ప్రేమి విశ్వనాథ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇన్ స్టా వేదికగా తెలిపింది.
అయితే తాజాగా వదిలిన ప్రోమో చూస్తుంటే అది నిజమేనని అర్థం అవుతోంది. యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్లిన దీప కోలుకొని డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ లో గట్టిగా అరుస్తుంది. కోమాలో ఉన్న వంటలక్క తాను ఊపిరి అందుకోవడంతో పాటు ఈ సీరియల్ కు ఊపిరి పోసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వంటలక్క రీ ఎంట్రీ గురించే వార్తలు వినిపిస్తున్నాయు. మరి ఇప్పుడు వదిలిన ప్రోమో ఎపిసోడ్ చూస్తే అసలు విషయం తెలుస్తుంది.