...

Petrol Prices Today : ఆరు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!

దేశంలో ఇంధన ధరలు ఆరు రోజుల నుంచి స్థిరంగానే కొనసాగుతున్నాయి. 22 రోజుల వ్యవధిలో దాదాపు 17 సార్లు చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. అయితే గురువారం నుంచి ఈరోజు వరకు విరామం ఇచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది. అయితే ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.66కు ఎగ బాకింది.