...

Ntr30: బన్నీ కాదన్న కథకు.. తారక్ యస్ చెప్పాడా..?

Ntr30 : ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియో దద్దరిల్లుతోంది. ఆయన అభిమానులు నెట్టింట శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. తారక్ కు బర్త్ డే విషెస్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో సందడి మామూలుగా లేదు. దీనికి తోడు తారక్ తన తర్వాతి సినిమాలకు సంబంధించిన అప్ డేట్లను కూడా ఇవ్వడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక తన అభిమాన హీరో చేయబోయే సినిమాల గురించి అప్పుడే వారు సోషల్ మీడియా వేదికగా చర్చ జరుపుతున్నారు.

Ntr30
Ntr30

అయిత ేతారక్ తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా… తన 31వ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కథను తొలుత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం రెడీ చేయగా… ఆయన అందుకు ఒప్పుకోలేదని వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన కాదంటేనే ఈ కథ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చిందని తెలుస్తోంది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని కొరటాల ఎన్టీఆర్ కోసమే ఈ కథను సిద్ధం చేశాడంటూ ఆయన అభిమానులు వివరిస్తున్నారు.

Read Also : Jr NTR : ఆ కారణం వల్లే మిమ్మల్ని కలవలేక పోయాను.. క్షమించండి అంటూ అభిమానులకు లేఖ రాసిన తారక్!