Intinti Gruhalakshmi July 5 Today Episode : తులసి అకౌంట్లో 20 లక్షలు వేసిన నందు.. మళ్లీ ఒకటైన లాస్య,నందు..?

Nandu gets furious with Lasya for cheating Tulasi in todays intinti gruhalakshmi serial episode
Nandu gets furious with Lasya for cheating Tulasi in todays intinti gruhalakshmi serial episode

Intinti Gruhalakshmi July 5 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ తీసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య టెన్షన్ పడుతూ నందు దగ్గరికి వస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో లాస్య నందు తో మాట్లాడుతూ తులసిని మోసం చేసి ఆ డబ్బులు నీకు పెట్టుబడిగా ఇచ్చాను అని అనడంతో నందు వెంటనే రగిలిపోతూ లాస్య చెంప చెల్లుమనిపిస్తాడు. దాంతో లాస్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే అదంతా కూడా ఊహించుకుంటుంది లాస్య.

Advertisement
Intinti Gruhalakshmi July 5 Today Episode
Intinti Gruhalakshmi July 5 Today Episode

ఆ తర్వాత నందు బయటికి వెళ్దాం పద అని అనగా తాను రాను నువ్వు ఒక్కడివే వెళ్ళు అని చెబుతుంది. ఆ తర్వాత తులసి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది లాస్య. తులసి ఇచ్చిన గడువులోపు ఎలా అయినా అకౌంట్లో డబ్బులు వేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భాగ్య బావగారికి నిజం చెబితే సరిపోయేది కదా అని అంటుంది.

అప్పుడు లాస్య నా చెంప పగల కొట్టి నా కాపురం నాశనం అయ్యేది అని అంటుంది. ఇప్పటికిప్పుడు 20 లక్షలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు అని అనగా వెంటనే లాస్య నువ్వే ఇవ్వాలి అనడంతో భాగ్య షాక్ అవుతుంది. గతంలో తులసి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా నాకు ఇంట్రెస్ట్ గా ఇవ్వు ఇస్తాను అనడంతో భాగ్యా నా దగ్గర డబ్బులు లేవు అప్పులకు కట్టేశాను అని చెప్పి అక్కడి నుంచి సన్నగా తప్పించుకుని వెళ్లడంతో లాస్య భాగ్యపై కోప్పడుతుంది.

Advertisement

ఒక తులసి, దివ్య చెస్ ఆడుతూ ఉండగా అప్పుడు దివ్య మామ్ లాస్య ఆంటీ తో ఆడుకోవడం అయిపోయిందా అని అనగా వెంటనే మనం చేసేది ఏమీ లేదు ఇప్పుడు లాస్య డబ్బు కోసం తిరుగుతూ ఉంటుంది అని అంటుంది. ఆ తర్వాత తులసి అకౌంట్ కి 20 లక్షలు పడ్డాయి అని మెసేజ్ రావడంతో వెంటనే తులసి లాస్యకి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది.

దాంతో లాస్య తాను వెయ్యకుండా మరెవరు డబ్బులు వేశారు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి నందు వచ్చి నేనే డబ్బులు వేశాను అనడంతో లాస్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. తులసిని మోసం చేసి డబ్బులు ఎలా ఇచ్చావు నువ్వు ఒక చీటర్ వి నువ్వు నేను కలిసి ఉండేది లేదు ఇక నీ దారి నీది నా దారి నాది అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు నందు.

Advertisement

ఆ తర్వాత లాస్య తులసికి ఫోన్ చేసి ఎందుకు నందుకు నిజం చెప్పావు అని అనగా తులసీ తాను నిజం చెప్పలేదు అనడంతో వెంటనే సంజన లాస్య కి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. ఆ తర్వాత నందు బయటికి వెళ్లకుండా లాస్య విషం తాగినట్టు నటిస్తుంది. ఇది అంతా నీ కోసమే చేశాను అని ముందుకు వినిపించేలా అరవడంతో నందు కూల్ అయ్యి లాస్యను దగ్గరికి తీసుకుంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Intinti Gruhalakshmi July 4 Today Episode : లాస్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తులసి.. లాస్యపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డ నందు..?

Advertisement