Naga shourya Comments : తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు, దర్శకులు హీరోయిన్లపై ఒక్కోసారి నోరు జారుతుంటారు. వారిని ఎవరైనా విపరీతంగా ట్రోల్స్ చేస్తే నాలుక కర్చుకుని క్షమాపణలు కోరుతుంటారు. అలాంటి ఘటనలో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలానే జరిగాయి. కొందరైతే ఏకంగా ఆ హీరోయిన్‌ను చూస్తే ముద్దుపెట్టుకోవాలని అనిపిస్తుందని, హగ్ చేసుకోవాలని అనిపించిందని నోరు జారిన సందర్బాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి హీరో నాగశౌర్య కూడా వచ్చిచేరాడు..
నాగశౌర్య తాజా మూవీ ‘లక్ష్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో హీరోయిన్ కేతిక శర్మను చూస్తూ సంచలన కామెంట్స్ చేశారు. కేతికశర్మను చూస్తే రొమాన్స్ చేయాలని పిస్తుందని నోరు జారాడు. ఆ తర్వాత నువ్వుతూ మెల్లిగా కవర్ చేసుకోచ్చాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే కేతిక ఇంతటి పాపులారిటీని సంపాదించుకోవడం గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు.
తను కెరీర్‌లో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక లక్ష్య సినిమా స్టోరీ విన్నప్పుడు చాలా బాగా నచ్చేసిందని అందుకోసమే 8పాక్స్ బాడీ ట్రై చేశానన్నాడు. కొందరు ఈ సినిమా కోసం ఇంతలా బాడీ బిల్డ్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నారని, స్టోరీ డిమాండ్ చేస్తే 10పాక్స్ అయినా చేయడానికి సిద్ధమని చెప్పాడు నాగశౌర్య..
Read Also : Aishwarya Rajesh : ఆ హీరో స్కూలుకు వెళ్లే పిల్లాడిలా చేసేవాడట.. అసలు విషయం చెప్పిన ఐశ్వర్య..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world