Hyderabad : వరుసకు అల్లుడు అవుతాడు. అతడితో అక్రమ సంబంధం పెట్టుకుందో అత్త. అంతటితో ఆగలేదు. అతడిపై లైంగికదాడికి పాల్పడింది. నగ్న వీడియోలు రికార్డు చేసి అల్లుడ్ని బ్లాక్ మెయిల్ చేసింది. బాధితుడి నుంచి డబ్బు, బంగారం లక్షల డబ్బు లాగేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో వెలుగుచూసింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో 15ఏళ్ల మేనల్లుడితో వరుసకు అత్త అయిన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అతడిపై అనేకసార్లు లైంగిక దాడి చేసింది. ఇదంతా అతడికి తెలియకుండా వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలను చూపించి అల్లుడిని బ్లాక్ మెయిలింగ్ చేసింది. అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించింది. బెదిరిపోయిన అల్లుడు ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తు వచ్చాడు.
అతడి నుంచి 20 తులాల బంగారంతో పాటు 6 లక్షల నగదు ఆమెకు ఇచ్చేశాడు. అప్పటికీ అత్త ఆశ తీరలేదు. ఇంకా తెవాలని అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అత్త వేధింపులు తాళలేక చివరికి అల్లుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితురాలిని విచారించి ఆమెపై కేసు నమోదు చేశారు.
Read Also : Aishwarya Rajesh : ఆ హీరో స్కూలుకు వెళ్లే పిల్లాడిలా చేసేవాడట.. అసలు విషయం చెప్పిన ఐశ్వర్య..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world