Aishwarya Rajesh : టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళ్ హీరో శివ కార్తికేయన్ మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన మూవీ కౌసల్య కృష్ణమూర్తి. ఈ మూవీ తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఐశ్వర్య రాజేశ్.. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి. ఆమె టాలీవడ్ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ ఆమె పేరెంట్స్ చిన్నప్పుడు తమిళ ఇండస్ట్రీలో సెట్ కావడంతో ఈ అమ్మడు అక్కడే సినీ కెరీర్ ప్రారంభించింది.
ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇటీవల సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేసింది అందరి చూపును తనవైపు తిప్పుకున్నది ఈ భామ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. మరి అవేంటో మనమూ తెలుసుకుందామా.. ఇంకెందుకు లేట్ మరి…
షూటింగ్ టైంలో సాయిధరమ్ తేజ్ చూపించిన డెడికేషన్ పట్ల కామెంట్స్ చేసింది. స్కూలుకు వెళ్లే పిల్లాడిలాగా ఆయన టైంకు లొకేషన్‌కు వచ్చేవాడంటూ చెప్పింది. ఆయన అందరితో గౌరవంగా నడుచుకునే వారని, కలుపుగోలుగా ఉంటాడని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.. అందువల్లే అతనిపై తనకు మంచి అభిప్రాయం ఉందని చెప్పింది. తన పేరెంట్స్ చెన్నైలో సెటిల్ అయినప్పటికీ.. తాను మాత్రం తెలుగింట ఆడిపిల్లలా పెరిగానని.. అందుకే తన అలవాట్లు, అభిరుచులు, ఆచారాలు తెలుగింటి అమ్మాయిలాగే ఉంటాయని చెప్పుకొచ్చింది.
రిపబ్లిక్ మూవీలో డైరెక్టర్ దేవకట్టా మంచి క్యారెక్టర్ ఇచ్చారని, అందుకోసం తాను చాలా కష్టపడ్డానని తెలిపింది. ఇక నుంచి తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ చాన్సులు వస్తే కంపల్సరీగా యాక్ట్ చేస్తానని స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మాయి తెలుగు ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలని చూస్తున్నట్టు టాక్. చూడాలి మరి ఈ భామ.. ఎలాంటి క్యారెక్టర్ ఉన్న పాత్రలు చేస్తుందో..
Read Also : Karthika Deepam Serial : ‘కార్తీక దీపం’ ఫేం ‘మోనిత’ నిజ జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world