Mitraaw Sharma : బిగ్ బాస్ అన్న తర్వాత ఎలిమినేషన్, నామినేషన్స్ ఉండటం సర్వసాధారణం. ఇలా ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున కంటెస్టెంట్ ల మధ్య గొడవలు కొట్లాటలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే హౌస్ మెట్స్ మధ్య మాటల యుద్ధం జరగడం,ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం ఇవన్నీ బిగ్ బాస్ హౌస్ లో సర్వ సాధారణం. ఇకపోతే తెలుగు ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికి ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వారంలోకి అడుగుపెట్టింది.
Mitraaw Sharma
ఇక 8వ వారంలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ఎంతో రసవత్తరంగా కొనసాగింది. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా మిత్రాశర్మ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిత్రా బిందు మాధవిని నామినేట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్లిపోయిన స్రవంతి గురించి ప్రస్తావించడం తనకు నచ్చడం లేదని నామినేట్ చేశారు.ఇక ఈ విషయం గురించి బిందుమాధవి కూడా మాట్లాడుతూ నువ్వు కూడా బయట వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించింది.
ఈ సందర్భంగా బిందుమాధవి నువ్వు బయట వాళ్ల గురించి మాట్లాడటం మానేస్తేనే తాను కూడా మానేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం గురించి మిత్రా మాట్లాడుతూ తనకు తన అనే వాళ్ళు ఎవరూ లేరని కేవలం తనకు తన భావ మాత్రమే ఉన్నారని అందుకే తన గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. ఇక బయట వాళ్ల గురించి మాట్లాడకూడదు అంటే తాను కూడా తన గురించి మాట్లాడనని తాను చనిపోతే తలకొరివి పెట్టడానికి కూడా ఎవరూ లేరంటూ మిత్రా ఎమోషనల్ అయ్యారు. అయితే ఇలా ఏడుస్తూ ఎమోషనల్ అయినా మిత్రా చివరికి నవ్వుతూ వెళ్లి బిందు మాధవిని హగ్ చేసుకోవడంతో ఈ ఎపిసోడ్ చూసిన జనాలకు కూడా ఒక్కసారిగా పిచ్చి లేసింది. అసలు తను ఎందుకు ఏడ్చింది? నవ్వుతూ వెళ్లి బిందు మాధవిని ఎందుకు హగ్ చేసుకుంది అనే విషయం తెలియక తలలు పీక్కుంటున్నారు.