...

Devotional Tips: పెళ్లైన మహిళలు జాగ్రత్త.. ఈ వస్తువులను పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్తున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: సాధారణంగా మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పెళ్ళైన మహిళ పుట్టింటి నుంచి అత్తవారింటికి కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి అత్తవారింట్లో అడుగు పెట్టే సమయంలో వస్తువులను తీసుకెళ్లడమే కాకుండా, మరీ మరీ పుట్టింటికి వచ్చిన ప్రతి సారి కొన్ని రకాల వస్తువులను తన పాటు అత్తవారింటికి తీసుకెళుతుంది.ఇక కూతురు అడిగితే తల్లి కూడా ఎంతో సంతోషంగా ఆ వస్తువులను తనతో పంపిస్తూ ఉంటారు.అయితే పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు తీసుకు వెళ్ళ కూడదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రింది తెలిపిన వస్తువులను పొరపాటున కూడా పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకువెళ్ళకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్క మహిళ పుట్టింటి నుంచి అత్తవారింటికి పులుపు, చేదు వస్తువులను తీసుకెళ్లకూడదు ఇలా పులుపు వస్తువులను తీసుకెళ్లడం వల్ల రెండు కుటుంబాల మధ్య చిన్న చిన్న విషయాలలో కూడా మనస్పర్థలు తలెత్తాయి. ఇక చేదు వస్తువులను తీసుకెళ్లడం వల్ల అభిప్రాయ భేదాలు తలెత్తి రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఆప్యాయతలు తొలగిపోతాయి. ఇక చాలామంది తన పుట్టింటి నుంచి ఎంతో గుర్తుగా, గౌరవంగా పూజాసామాగ్రిని అత్తవారింటికి తీసుకెళ్తారు. ఇలా పూజా సామాగ్రిని అత్తవారింటికి తీసుకెళ్లడం వల్ల రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి.

అలాగే పుట్టింటి నుంచి నల్లని వస్త్రాలను కూడా తీసుకెళ్లకూడదు.ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది పట్టణంలో నివసించడం వల్ల పుట్టింటికి రాగానే పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్తుంటారు. మరిముఖ్యంగా చింతపండు, చీపురు, ఇలాంటి వస్తువులను పొరపాటున కూడా తీసుకెళ్లకూడదు. ఎందుకంటే వీటిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కనుక పుట్టింటి నుంచి వీటిని మన అత్తవారింటికి తీసుకెళ్లడం వల్ల పుట్టింటిలో ఉన్న లక్ష్మీదేవిని తీసుకెళ్లినట్లు.ఇలా ఈ వస్తువులను తీసుకెళ్లడం వల్ల పుట్టింటిలో ఆర్థిక సమస్యలు వెంటాడతాయని పండితులు చెబుతారు. అందుకే పొరపాటున కూడా ఈ వస్తువులను అత్తవారింటికి తీసుకెళ్లకూడదు.