Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. ఇక ఈ సినిమాని వచ్చే నెల 12వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్లను విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మూడవ పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని క్షణాలలో ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల కానుంది. నేడు ఉదయం 11 గంటల7 నిమిషాలకి సర్కారీ వారి పాట టైటిల్ సాంగ్ విడుదల కానుంది. ఈ పాట కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే మూడవ పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబు కూతురు సితార కూడా ఈ సినిమాలో పెన్నీ సాంగ్ లో కనిపించి అభిమానులను సందడి చేశారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World