Mahesh babu: ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అటు మహేష్ అభిమానులతో పాటు ఇటు సినీ ప్రేక్షకులకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జంటగా కీర్తి సురేష్ నటించింది. ఇప్పటికే సర్కారు వారి పాట టీజర్, ట్రైలర్, సాంగ్స్ షేక్ చేసేస్తున్నాయి. పాటలైతే అదిరిపోయాయి అనే టాక్ వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన ఫ్యాన్స్ కు రాసిన లేఖ వైరల్ అవుతోంది. అసలు అందులో ఏముందో తెలుసుకోవాలనుందా.. అయితే.. పదండి.
“సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఎన్నో అంచనాలతో ఎంతగానో ఎదురు చూస్తున్న మన సర్కారు వారి పాట చిత్రాన్ని థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయండి.” అని లేఖలో మహేష్ బాబు పేర్కొన్నారు.
అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ రాధాకృష్ణ ప్రొడక్షన్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు అవుతుందని తన తర్వాతి సినిమా అప్ డేట్ కూడా ఇచ్చేశాడు మహేష్. మొత్తానికి ఫ్యాన్స్ ను తన సినిమా థియేటర్లలోనే చూడండని చెప్తూనే కొత్త సినిమా షూటింగ్ కూడా ఉంటుందని మహేష్ బాబు గుడ్ న్యూస్ అందించాడు.
Superstar @urstrulyMahesh Letter To Fans 🤩❤#SarkaruVaariPaata pic.twitter.com/BlLfJ76N5B
— Mahesh Babu Trends 🔔 #SVPOnMay12 (@MaheshFanTrends) May 7, 2022