Guppedantha Manasu : మహేంద్ర చేసిన పనికి బాధపడుతున్న రిషి.. ఒకరికొకరు ఎదురుపడ్డ జగతి, రిషి..?

Guppedantha Manasu March 4 Today Episode
Guppedantha Manasu March 4 Today Episode

Guppedantha Manasu March 4 Today Episode  : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బాగానే ఆకట్టుకుంటోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. మహేంద్ర చేసిన పనికి బాధపడుతున్న రిషి గౌతమ్ కార్ లో ఇంటికి తీసుకుని వెళుతూ రిషి బాధపడకు, నేను నీ పెళ్లి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అని ధైర్యం చెబుతాడు.

Guppedantha Manasu March 4 Today Episode
Guppedantha Manasu March 4 Today Episode

రిషి నువ్వు అలా ఉంటే నేను చూడలేను రా అలా ఉండకు గౌతమ్ ధైర్యం చెబుతాడు. మరొక వైపు దేవయాని జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఫణింద్ర ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఫణీంద్ర ఈ విషయాన్ని పెద్దది చేయకు, ఎవరితోనూ దీని గురించి మాట్లాడొద్దు అంటూ కోపంగా చెబుతాడు.

Advertisement

అప్పుడే మహేంద్ర ఇంటికి రావడంతో మహేంద్ర చూసినా దేవయాని ముఖం తిప్పుకుంది. ఇంతలో అక్కడికి రిషి రావడాన్ని గమనించిన దేవయాని ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ జరిగిన విషయం గురించి మళ్ళీ మాట్లాడుతూ రిషి ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

అప్పుడు మహేంద్ర దేవయానికి ఎదురు తిరుగుతూ జగతి నా భార్య అని చెప్పినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అంతే కాకుండా ఇక్కడ ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని మహేంద్ర అనగా ఆ మాటలకు రిషి కోప్పడగా దేవయాని షాక్ అవుతుంది.

Advertisement

Guppedantha Manasu March 4 Today Episode : నేను నీ పెళ్లి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను..

దేవయాని తన మాటలతో రిషిని మరింత రెచ్చగొడుతుంది. ఇంతలో గౌతమ్ దేవయాని దగ్గరకు వచ్చి, పెద్దమ్మ గారు ప్రస్తుతం రిషి బాధపడుతున్నాడు ఇప్పుడు ఎవరూ తనని మాట్లాడించకండి అంటాడు. జగతి మేడం చాలా మంచిది, రిషి అమ్మ అని తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని గౌతం అనగా ఆ మాటలకు దేవయాని కోపంతో రగిలిపోతుంది.

ఇక జగతి ని గౌతమ్ దృష్టిలో చెడుగా చూపించాలి అని అనుకుంటుంది. కానీ గౌతమ్ దేవయాని మాటల్ని పట్టించుకోకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు వసుధార జరిగిన విషయాలను తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు అందరికీ కాల్ చేస్తుంది. ఎవరు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ పడుతుంది. చివరికి గౌతమ్ కి ఫోన్ చేసి జరిగినదంతా వివరిస్తుంది. అప్పుడు గౌతమ్ కూడా గతంలో రిషి,మహేంద్ర, జగతి ల గురించి తాను మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలి అనుకుంటాడు.

Advertisement

వసుధారా గౌతమ్ కి రిషి గురించి జాగ్రత్తలు చెబుతోంది. రిషి సార్ ని జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతుంది. మరోవైపు కాలేజీలో జగతి, రిషి ఎదురు పడతారు. మరి రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Guppedantha Manasu : మహేంద్ర చేసిన పనికి రగిలిపోతున్న రిషి..

Advertisement