Zodiac Signs : మే నెల 2022లో సింహ రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు అష్టమ స్థానంలో.. రాహువు తొమ్మిదింటిలో, శని ఏడింటిలో, కేతువు మూడింటిలో ఉన్నాడు. ఈ గ్రహ సంచారాల వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. కొంచెం కష్టపడితే చాలు అధిక లాభాలను పొందవచ్చు. ఈ మాసమంతా సింహ రాశి వారికి శుభ ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగుది. తండ్రికి సంబంధించిన ఇండ్లు, పొలాలు వంటివి మీ సొంతం అవుతాయి. అయితే ఈ నెలలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది.ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు కచ్చితంగా ఉద్యోగాలు పొందుతారు.
వ్యాపారంలో డబ్బులు పెట్టాలనుకున్న వాళ్లు ఈ నెలలో పెడితే చాలా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు అవార్డులు, రివార్డులతో పాటు ప్రమోషన్లు వచ్చే సూచనలున్నాయి. సింహ రాశి వారికి ఈ నెల టర్నింగ్ పాయింట్ లా కనిపిస్తోంది. మీ ఆస్తి విషయాల్లో కాస్త శ్రద్ధ అవసరం, అలాగే వ్యాపార, జీవిత భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించండి. మాట జారితే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.