Ramya krishna : రాజమాత శివగామిగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. లేడీ సూపర్ స్టార్ గా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని చాలా భాషల్లో వచ్చిన సినిమాల్లో నటించారు రమ్య కృష్ణ. అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ కాలం నుండి నేటికీ తనదైన శైలి కలిగిన పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళా భాషా చిత్రాల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అయితే శివగామి పాత్రతో రమ్య కృష్ణ ఫేం మరింత పెరిగిందనే చెప్పాలి. ఆ పాత్రలో రమ్య కృష్ణ కాకుండా మరొకరిని ఊహించుకోలేని రీతిలో అభినయాన్ని ప్రదర్శించారు లేడీ సూపర్ స్టార్.

lady superstar ramya krishnan entering aha as a judge for the show dance ikon
Ramya krishna : ఆహా ఐకాన్ డ్యాన్స్ రియాలిటీ షో జడ్జీ రమ్యకృష్ణ..
సినిమాల్లోనే కాకుండా మంచి పాత్రలు వచ్చినప్పుడు ఓటీటీ సిరీస్ ల్లోనూ నటిస్తున్నారు రమ్య కృష్ణ. జయ లలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన సిరీస్ లో నటించారు. అయితే ఇప్పుడే అదే దారిలో వెళ్తున్నారు రమ్య కృష్ణ. ఓటీటీ సంస్థ ఆహాలో రాబోతున్న రియాలిటీ షోలో కనిపించబోతున్నారు. డ్యాన్స్ ఐకాన్ అనే డ్యాన్స్ రియాలిటీ షో రాబోతుంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ ఈ షోకి బ్రాండ్ అంబాసిడర్ లా ఆహ్వానించారు. అయితే ఈ షోకు రమ్యకృష్ణ లాంటి లేడీ సూపర్ స్టార్ జడ్జీగీ వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 11న ఆహాలో ప్రీమియర్ అయింది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
Read Also : ramakrishna : తాగి ట్వీట్ చేశావా అంటే.. ముక్కుసూటిగా రిప్లై ఇచ్చిన రాహుల్ రామకృష్ణ!