Janaki Kalaganaledu March 8th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. జ్ఞానాంబ, గోవిందరాజు లు పెళ్లి రోజు సందర్భంగా స్వీట్లు తినిపించుకున్నారు ఉంటారు. చూసి కుటుంబ సభ్యులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తుండగా మల్లికా మాత్రం ఏదో కోల్పోయినట్టు గా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా జ్ఞానాంబ, పెద్దకోడలు జానకి ని పొగడటం మళ్లీక కు ఏమాత్రం ఇష్టం లేదు.
ఇంతలో అక్కడికి నీలావతి వచ్చి జ్ఞానాంబ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మనవడు పుట్టడానికి నోచుకోలేదు ఏమో పాపం అంటూ దెప్పి పొడుస్తుంది. నీలావతి అన్న మాటలకు జ్ఞానాంబ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు కోప్పడిన గోవిందరాజు నీలావతి పై విరుచుకు పడతాడు.

Janaki Kalaganaledu March 8th Today Episode
బిడ్డ విషయంలో నీలావతి వైజయంతి జ్ఞానాంబ చేసిన సవాల్ గురించి చెబుతుంది. నీలావతి మాటలకు బాధపడిన జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక కుటుంబం అందరూ బాధపడటం దానికి కారణం లీలావతి అంటూ కుటుంబ సభ్యులందరూ చర్చించుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే నీలావతి ఎవరు పిలవకుండా అక్కడికి ఎందుకు వస్తుంది అని డౌట్ వ్యక్తం చేస్తారు. మల్లిక తన యాక్టింగ్ తో ఆ విషయాన్ని కవర్ చేస్తుంది. మరొక వైపు జ్ఞానాంబ తన కోడలు కి పెళ్లి అయ్యి అన్ని ఏళ్ళు అయినా కూడా పిల్లలు కలగకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకునే బాధ్యత నాది అంటూ బాధపడుతూ ఉంటుంది.
గోవిందరాజు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది జ్ఞానాంబ బాధపడకు ఓదారుస్తాడు. ఆ తరువాత జ్ఞానాంబ వాంతులు చేసుకుంటూ ఉండగా జ్ఞానాంబ దంపతులు జానకి నెల తప్పింది అని గ్రహించుకుంటారు.
జానకి నెల తప్పడంతో జ్ఞానాంబ దంపతులు సంతోషంతో మునిగితేలుతూ ఉంటాడు. అదే శుభవార్త జ్ఞానాంబ నీలావతికి గిఫ్టుగా ఇస్తూ వైజయంతి కి ఆ విషయం చెప్పమంటూ గర్వంగా ఫీల్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.