...

Mahesh Babu: మహేష్ బాబు అందం వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదేనా.. ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకి జెంట్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కన్నా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికంగా ఉంది.సాధారణ అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం మహేష్ బాబుకి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. మహేష్ బాబు ప్రస్తుతం నాలుగు పదుల వయస్సులో ఉన్నప్పటికీ ఈయన ఎంతో అందంగా తన గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈయన అందం వెనుక దాగి ఉన్న సీక్రెట్ మహేష్ బాబు బయటపెట్టారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సుమ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ తో ఇంటర్వ్యూ నిర్వహించారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ మహేష్ బాబును కొన్ని ప్రశ్నలు అడిగే ఆసక్తికరమైన సమాధానాన్ని రాబట్టింది. ఇక సుమ మహేష్ బాబుని ప్రశ్న అడుగుతూ చాలా మంది మహేష్ బాబు ఎంతో అందంగా ఉంటారు…ఆయన ఎలాంటి ఫుడ్ తీసుకుంటారని సందేహ పడుతుంటారు. మరి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెపుతూ అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటానని అయితే వాటన్నింటినీ చాలా లిమిట్ గా తీసుకుంటానని వెల్లడించారు. ఇకపోతే పిజ్జా, బర్గర్,పాల పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటానని పిల్లలతో సరదాగా గడుపుతున్న సమయంలో వారి కోసం ఆల్మండ్ మిల్క్ తో తయారుచేసిన స్వీట్స్ తీసుకుంటానని మహేష్ బాబు తన ఫుడ్ గురించి వెల్లడించారు.గత పది సంవత్సరాల నుండి ఫుడ్ విషయంలో తాను ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నానని మొదట్లో చాలా కష్టంగా అనిపించినా ప్రస్తుతం అలవాటయిందని మహేష్ బాబు తెలియజేశారు.