Chiranjeevi : సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లకు ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు వారి సినిమా ప్రారంభించే సమయంలోనూ విడుదల సమయంలోనూ వారి సెంటిమెంట్ కి అనుగుణంగా సినిమాలని ప్రారంభించడం,విడుదల చేయడం చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా తన సెంటిమెంట్ మరొకసారి వర్కౌట్ అయిందని చెప్పాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలకు “ఆ”అనే అక్షరం బ్యాడ్ సెంటిమెంట్ గా ఉంది. ఆ అక్షరంతో సినిమాలు చేస్తే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతూ మెగాస్టార్ కు నిరాశ కలిగించాయి.
ఈ క్రమంలోనే గతంలో మెగాస్టార్ నటించిన ఆరని మంటలు, ఆలయ శిఖరం, ఆరాధన, ఆపద్బాంధవుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలోనే ఇదే సెంటిమెంట్ తో మెగాస్టార్ తాజాగా నటించిన ఆచార్య సినిమా కూడా విడుదలైంది. అయితే మెగాస్టార్ కెరియర్లో ఆ సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అయ్యి మెగాస్టార్ కు తీవ్ర నిరాశ కలిగించింది.
’అ‘తో సినిమాలే కలిసొచ్చాయా? :
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి టైటిల్ విషయంలో ‘ఆ’ అనే అక్షరం కలిసిరాలేదని భావించారు. ఇకపోతే టైటిల్ మొదటి అక్షరంలో ‘అ’ పేరుతో వచ్చిన సినిమాల్లో అడవి దొంగ అన్నయ్య వంటి సినిమాలు హిట్ అయిన ప్పటికీ ఆ అనే అక్షరంతో మొదలయ్యే సినిమాలు మాత్రం ఈయనకు కలిసి రాలేదని చెప్పాలి.ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు ఈ సినిమాలో రామ్ చరణ్ నటించడం వల్ల రామ్ చరణ్ విషయంలో కూడా రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయిందని మెగా అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరో నటించిన తరువాత చిత్రం బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంటుందనే సెంటిమెంట్ ఉంది. ఈ క్రమంలోనే ఆచార్య విషయంలో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయిందని నెటిజన్లు భావిస్తున్నారు.
Read Also : Acharya Flop : ‘ఆచార్య’ పోస్ట్‌మార్టం రిపోర్ట్.. ప్లాప్‌కు ఆ నాలుగు కారణాలు..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World