Trivikram Srinivas : డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అయితే అదే దారిలో వెళ్తున్న మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుని ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి జరిమానా విధించారు. ఆ సమయంలో త్రివిక్రమ్ కారులోనే ఉన్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించాలని కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
అయినప్పటికీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. ఈయన ఒక్కడిదే కాదు అలా బ్లాక్ ఫిల్ములు ఉన్న చాలా వాహనాలకు జరిమానా విధిస్తున్నారు ఈ క్రమంలోనే ఇటీవల మంచు మనోజ్, జూనియర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించి ఫైన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే.
Read Also : Aadhar Mobile Number: ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ కు లింక్ చేశారో మర్చిపోయారా.. అయితే ఇలా తెలుసుకోండి!