...

ORR Toll Charges : ఈరోజు నుంచే ఓఆర్ఆర్ పై పెరిగిన టోల్ ఛార్జీల వసూలు

ORR Toll Charges : హైదరాబాద్ ఓఆర్ఆర్(ఔటర్ రింగ్ రోడ్)పై పెరిగిన టోల్ ఛార్జీలు ఇవాళ్టి నుండి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)లోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్.. 3.5 శాతం నుండి 5 శాతం వరకు ఛార్జీలను పెంచింది. వాహనదారులకు కిలో మీటరుకు 7 పైసల నుంచి 53 పైసల వరకు భారం పడుతుంది. టోల్ ఛార్జీల పెంపుదలతో నెలవారీ పాస్ ఛార్జీలు కూడా పెరిగినట్లే.

ORR Toll Charges
ORR Toll Charges

వాహనాల కేటగిరీ ఆధారంగా ప్రతి కిలో మీటరుకు రూ. 2 నుండి రూ. 13 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వసూలు బాధ్యతలను ఈగల్ అనే ప్రైవేటు కంపెనీకి ఇచ్చారు. 18 నెలలకు గాను రూ. 630 కోట్లు చెల్లిస్తామని సదరు సంస్థ హెచ్ఎండీఏకు కోట్ చేసింది. రోజూ లక్షా 30 వేల వాహనాలు ఓఆర్ఆర్ పై రాకపోకలు సాగిస్తాయి. ఈ ధరల పెంపుతో నెలనెలా కోటి 30 లక్షల రూపాయల అదనపు ఆదాయం హెచ్ఎండీఏకు సమకూరనుంది. ఓఆర్ఆర్ పై మొత్తం 19 ఇంటర్ ఛేంజ్ల వద్ద టోల్ వసూలు చేస్తున్నారు.

Read Also : High Temperature : భానుడి భగభగ… బయటకొస్తే మాడిపోవాల్సిందే!