Horoscope Today 10 March 2022 : ఈరోజు బుధవారం (మార్చి 10, 2022) రాశిఫలాలు మీకు అనుకూలంగా ఉన్నాయో లేదో ఓసారి పరిశీలించుకోండి. కొత్త పనులు మొదలుపెట్టేవారు.. కొత్త ఉద్యోగాల్లో చేరేవారు, వాహనాలు కొనుగోలుదారులు, ఏదైన కార్యం చేయదల్చినవారు తప్పకుండా ఈరోజు రాశిఫలాలను పరిశీలించుకోండి. మీకు అనుకూలంగా ఉన్నాయా లేదో చూసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలను అందించనున్నాయి రాశిఫలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మేషరాశి :
ఈ రోజు.. మీరు మీ ఇంటిని పునర్నిర్మించడానికి కొన్ని కళాఖండాలను కొనుగోలు చేసేందుకు ఖర్చు చేసే అవకాశం ఉంది. అది మీ సామాజిక స్థితిని పెంచవచ్చు. మీరు మీ కుటుంబ వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలను అమలు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో అది మీకు లాభాలను తెచ్చిపెట్టవచ్చు. మీ జీవితం సామాజికంగా చాలా బిజీగా మారిపోతుంది.
వృషభం :
ఈ రోజు.. మీకు మంచి రోజుగా చెప్పవచ్చు. మీకు మంచి శక్తిని, ఆరోగ్యాన్ని అందించే రోజు.. మీరు చేసే పని ద్వారా మీకు సంతోషం లభించనుంది. ముక్కుసూటిగా మాట్లాడేవారికి బయటివారితో కొంత సవాల్ గా మారే అవకాశం ఉంది. పనికిరాని విషయాలపై వాదనలకు దూరంగా ఉండటమే మేలు. లేకపోతే కుటుంబంలో కొన్ని వివాదాలకు దారితీయొచ్చు. ఉద్యోగార్ధులకు తగిన ఉద్యోగం దొరుకుతుంది. ప్రేమ జంటలు పనికిరాని అంశాలపై వాదనలకు దూరంగా ఉండటం అన్ని విధాలుగా శ్రేయస్కరం.
మిథునరాశి :
ఈరోజు.. మీకు చంద్రుడు అనుకూలంగా లేడు. మీలో ఏదో తెలియని అసంతృప్తిగా అనిపించవచ్చు. ఈరోజులో మీరు ఎక్కువగా అసహనానికి గురవుతారు. మీ పనిని మీరు చేయడం కూడా చాలా కష్టంగా అనిపించవచ్చు. మీ కోరికను నెరవేర్చుకోలేకవచ్చు. మీకు అప్పజేప్పిన బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తుంటారు. అంటే. ఈ రోజు తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేయలేరు. ఈ రోజంతా గడ్డు కాలమనే చెప్పాలి.
కర్ణాటకం :
ఈరోజు.. మీరు చంద్రుని ఆశీస్సులు బలంగా ఉన్నాయి. పనికి సంబంధించిన ఒత్తిడి తగ్గవచ్చు. మీ సంపాదన లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. మీరు దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. మీరు విదేశీ పనులపై ఆసక్తి పెంచుకోవచ్చు. రాబోయే భవిష్యత్తులో మీకు ఆర్థిక ప్రయోజనాలను అందించవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు.
సింహ రాశి :
ఈరోజు.. మీకు చంద్రుడి నుంచి సానుకూలత ఉంది. మీ వృత్తిపరమైన జీవితంలో మంచి పనితీరును కనబరుస్తారు. మీ కింది అధికారుల సాయంతో మీరు మీ వ్యాపార ప్రణాళికలను చాలా సులభంగా అమలు చేయవచ్చు. మేధోపరమైన పెట్టుబడులు, ఆర్థిక పెట్టుబడులు లాభాలను పొందవచ్చు. తద్వారా మీపై మీకు విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మరిన్ని ప్రయోజనాలను పొందేందుకు మీరు మీ వివేకాన్ని వినియోగించుకోవాల్సి రావొచ్చు.
కన్య :
ఈరోజు.. మీకు చంద్రుని సానుకూలత అద్భుతంగా ఉంది. మీ ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మీ ఆలోచనా విధానం సానుకూలంగా ఉండవచ్చు. మీరు ఈ రోజు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలు వంటి పవిత్రమైన ప్రదేశాలను సందర్శించాలని భావించవచ్చు. మీకు క్షుద్ర శాస్త్రంపై కూడా ఆసక్తి ఉండవచ్చు. దోషరహితమైన కార్యాలపై ఆసక్తి చూపే అవకాశం ఉంది.
మీ అభిప్రాయాలను మీతో మాత్రమే ఉంచుకోవాలి. మీ భావాలను అర్థం చేసుకోగల వ్యక్తితో మాత్రమే చర్చించడానికి ప్రయత్నించండి. లేదంటే.. మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తులారాశి :
ఈరోజు.. మీరు నిస్తేజంగా అనిపించవచ్చు. మీకు ఓపిక లేకపోవచ్చు. మనసును శాంతితో నింపుకోనేందుకు ఆలోచనలో పడతారు. ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు.. మీ మనస్సు చెప్పినట్టు నడుచుకోవడమే మంచిది. ధ్యానం, మంత్రం పఠించడం ద్వారా మీరు లోతైన జ్ఞానాన్ని పొందవచ్చు. పలు విషయాలపై ఏకాగ్రతను పొందవచ్చు.
వృశ్చికరాశి :
ఈ రోజు.. మీకు చంద్రుని ఆశీస్సులు దివ్యంగా ఉన్నాయి. మీ అంతర్గత బలాన్ని మెరుగుపర్చుకోగలరు. మీ వ్యాపారం, చేయబోయే కార్యాల్లో కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో లాభాలను అందించే అవకాశం ఉంది. దంపతులు సంతానం విషయంలో శుభవార్త వింటారు. ప్రేమ జంటలు తమ సంబంధంలో సామరస్యాన్ని ఉండేందుకు ఒకరితో ఒకరు తమ అభిప్రాయాలను చెప్పుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
ధనుస్సు రాశి :
ఈరోజు.. మీకు చంద్రుని ఆశీస్సులు బ్రహ్మండంగా ఉన్నాయి. గందరగోళ విషయాలన్నీ ఇప్పుడే నియంత్రణలోకి వస్తాయి. మీ పనితీరును మీ బాస్ ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీరు ప్రమోషన్ పరంగా కొత్త బాధ్యతలను పొందే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు, ఇప్పుడు తిరిగి చేతికి అందే అవకాశం ఉంది. మీరు చేసే పొదుపులో ఈ సొమ్ము ఉపయోగపడొచ్చు. చట్టపరమైన విషయాల పరంగా మీరు కొన్ని శుభవార్తలను వినవచ్చు. తోబుట్టువులతో ఉన్న సమస్యలు ఇప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
మకరరాశి :
ఈ రోజు.. మీరు ఉద్యోగ పరంగా ఒక శుభవార్త వినవచ్చు. మీరు మీ కెరీర్‌ను చక్కబెట్టుకోవడానికి ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు కొన్ని ప్రేరణ కలిగించే కార్యాల్లో బిజీగా ఉండవచ్చు. ఒంటరిగా ఉన్నవారు వివాహ పరంగా శుభవార్తలు వింటారు. దంపతులు పిల్లల పుట్టుకకు సంబంధించి కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంది.
కుంభం :
ఈరోజు.. మీరు స్థలంలో మార్పు కోసం ప్లాన్ చేయవచ్చు.. ఈరోజు మరో ప్రాంతానికి వలసగా వెళ్లడానికి సంబంధించిన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది. వ్యాపారంలో పెట్టుబడిని పెట్టకపోవడమే మంచింది. ఈ సాయంత్రానికి ఆ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్దలలో ఒకరి నుంచి సలహాలు తీసుకోండి. అలా చేయడం ద్వారా మీలో గందరగోళ పరిస్థితిని నియంత్రించవచ్చు.
మీనరాశి :
ఈరోజు.. మీలో ఎక్కడలేని ఓపికను కలిగి ఉంటారు. ధ్యానం మీకు ఏకాగ్రతను పెంచడంలో సాయపడుతుంది. మీరు చేస్తున్న ప్రాజెక్ట్‌ను మరింత వేగవంతం చేస్తుంది. మీ కింది అధికారులు మీకు సహకరించవచ్చు. ప్రాజెక్ట్‌ను సమయానికి ముందే పూర్తి చేయడంలో మీకు సహాయపడవచ్చు. పని విషయంలో మీరు కొన్ని చిన్న ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచడంలో సాయపడే ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది.