...

Horoscope: మకర రాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో మకర రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మకర రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాల కంటే ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక ఉద్యోగం వచ్చే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయండి. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుది. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా బాగుంది. ఆశించిన దాని కంటే కూడా ఎక్కువ లాభాలను పొందుతారు. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్లకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కొత్త వ్యక్తులతో కలిసి పని చేసే సూచనలు ఉన్నాయి. దీని వల్ల మీరు చాలా లాభాలు పొందబోతున్నారు.

వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే ప్రేమించిన వారినిపెళ్లి చేసుకునే యోగం కనిపిస్తోంది. భగవత్ అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు మంచి మంచి ఆలోచనలు, అవకాశాలు వస్తున్నాయి. భూమి, స్థలాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహాలు, ప్లాట్లు, భూమి కొనుగోలు చేసేటప్పుడు ఒఖటికి పది సార్లు ఆలోచించండి. అక్కడ ఏదైనా సమస్య ఉందా పేపర్లు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్కొని కొనుగోలు చేయండి. అలాగే కుటుంబ సభ్యుల ఒత్తిడి చాలా ఎక్కువాగా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది. అలాగే లలితా, విష్ణు సహస్ర నామాలు చదివితే అనుకున్నది సాధించగల్గుతారు.