...

Karthika Deepam: వామ్మో.. సౌర్య కోసం తను ప్రేమించిన వ్యక్తినే త్యాగం చేసిన హిమ

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌర్య నిన్ను నా మొగుడు అని చెప్పుకుంటుంటే ఎంత ఆనందం వేసిందో తెలుసా అని నిరూపమ్ ఫోటో చూసుకుంటూ అంటుంది. మరోవైపు హిమ, నిరుపమ్ ల నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. నిశ్చితార్థం జరుగుతుందనీ అందరు అనుకుంటున్నారు.

కానీ అది జరగని పని అని స్వప్న మనసులో అనుకుంటుంది. ఇక సౌందర్య నీ మనసులో ఆలోచనలు అన్నీ తీసేయి. నీ కోరిక మేరకే ఈ పెళ్లి జరుగుతుందని హిమ కు ధైర్యం చెబుతుంది. మరోవైపు సౌర్య నిరూపమ్ ఫోటో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అంతే కాకుండా నువ్వు చెప్పాలనుకున్న మాట వినాలని ఎంతో ఆరాటంగా ఉంది అని అనుకుంటుంది.

ఒకవైపు ప్రేమ్ నా ప్రేమ గురించి ముందే చెప్పి ఉండాల్సింది ఇలా జరిగి ఉండేది కాదని అనుకుంటూ తెగ బాధపడుతూ ఉంటాడు. ఇక సౌర్య నిరూపమ్ ఎక్కడున్నాడో తెలుసుకుంటూ ఉంటుంది. నిశ్చితార్థం లో ప్రేమ్ ఫోటోలు తీసుకుంటూ.. హిమ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇలా జరిగింది ఏంటి? అని బాధపడుతూ ఉంటాడు.

ఇక సౌందర్య సప్న నిశ్చితార్థం లో ఇంత కూల్ గా ఉంది ఏంటి? అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ హిమ గురించి ఆలోచించడం కూడా సంస్కారం కాదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సత్య జేబులో ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్స్ మిస్ అవుతాయి. దానికి అందరూ ఆలోచిస్తూ ఉండగా స్వప్న హ్యాపీ గా ఫీల్ అవుతుంది.

ఇక సౌందర్య మరో రెండు రింగులు ముందుగానే తెచ్చిపెట్టి ఉంచుకుంటుంది. దాంతో అందరూ హ్యాపీ గా ఫీల్ అవుతారు. ఈ లోపు అదే గుడికి సౌర్య వచ్చి మనిద్దరికీ పెళ్లి కావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను అని అనుకుంటుంది. ఇక దేవుడికి దండం పెట్టుకోవడానికి సౌర్య అదే గుడి లోకి వెళుతుంది.

ఆ తర్వాత సౌందర్య సప్న గురించి భయపడుతున్నావా? అదేం చేయలేదే నువ్వు భయపడకు అని హిమకు ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక స్వప్న.. మమ్మీ హిమకు ఎదో ధైర్యం చెబుతున్నట్టుంది. మీ ధైర్యాలు కొద్దిసేపు మాత్రమే మమ్మీ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నిరూపమ్ నాకు ఈ ప్రపంచాన్ని జయించినట్లుగా ఉంది అని హిమకు చెబుతాడు.

ఇక రేపటి భాగం లో హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. ఆ తర్వాత తన తల్లిదండ్రుల ఫోటోలు దగ్గరికి వెళ్లి సౌర్య కోసం నా ప్రేమను అడ్డుగా వేశాను. సౌర్య మనసులో ఏముందో నాకు ఈ రోజే తెలిసింది అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.